Muda Scam: సీబీఐపై నిషేధం.. ఈడీ ఎంటర్ అవుతుందా..
ABN, Publish Date - Sep 27 , 2024 | 03:00 PM
ముడా స్కామ్‌తో ఈ నిర్ణయానికి సంబంధం లేదని సిద్ధరామయ్య ప్రభుత్వం చెబుతోంది. ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య నిందితుడిగా ఉండటంతో సీబీఐ కేసు దర్యాప్తు చేపడుతుందనే అనుమానంతోనే సీబీఐ ప్రవేశంపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించిందనే ఆరోపణలు..
కర్ణాటకలో సీబీఐ నేరుగా ప్రవేశించడంపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను కర్ణాటక మంత్రివర్గం ఆమోదించింది. ముడా స్కామ్ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ బీజేపీ ఆరోపిస్తుండగా.. ముడా స్కామ్‌తో ఈ నిర్ణయానికి సంబంధం లేదని సిద్ధరామయ్య ప్రభుత్వం చెబుతోంది. ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య నిందితుడిగా ఉండటంతో సీబీఐ కేసు దర్యాప్తు చేపడుతుందనే అనుమానంతోనే సీబీఐ ప్రవేశంపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్య ప్రభుత్వం సీబీఐ ప్రవేశంపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం తరువాత వివిధ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంతో సీబీఐ ఈ కేసును విచారించకుండా ఉంటుందా.. ఈడీ ఈ కేసును దర్యాప్తు చేయగలదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధరామయ్యకు అధిష్టానం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ముడా స్కామ్‌లో తదుపరి ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.
అమరావతి: APMDC మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్ట్
సీబీఐ విచారణకు ఛాన్స్ ఉందా..
రాష్ట్రంలోకి నేరుగా ప్రవేశించకుండా సీబీఐపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. ఏదైనా కేసును సీబీఐ విచారించాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నేరుగా సీబీఐ కేసు విచారణ చేపట్టేందుకు అవకాశం లేదు. కానీ న్యాయస్థానాలు అనుమతిస్తే మాత్రం సీబీఐ కేసు విచారణ చేపట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిషేధించినా కోర్టు జోక్యంతో బెంగాల్‌లో సీబీఐ విచారణ చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. కోల్‌కతా హైకోర్టు ఆదేశాలతో సందేశ్‌ఖాలీ, ఆర్ జి కర్ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసు దర్యాప్తు కోసం సీబీఐ బెంగాల్‌లో ప్రవేశించింది. ఈ పరిస్థితుల్లో కర్ణాటక హైకోర్టు ఈ కేసు విచారణ చేపట్టాలని ఆదేశిస్తే మాత్రం సీబీఐ కేసు విచారణ చేపట్టగలదు.
Tirumala: జగన్ పర్యటనపై వివాదం.. నోరుమెదపని వైసీపీ
ఈడీ దర్యాప్తు చేస్తుందా..
సీబీఐపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షల నేపథ్యంలో ఈకేసును ఈడీ విచారిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. రెండు సందర్భాల్లో మాత్రమే ఏదైనా కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయగలదు. ఏదైనా కేసును మనీలాండరింగ్ జరగిందని భావిస్తే పీఎంఎల్‌ఏ చట్టం కింద ఈడీకి కేసు నమోదు చేసే అధికారం ఉంటుంది. ఫెమా (1999), ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగడ్ యాక్ట్ 2022 (పిఎమ్ఎల్ఎ) కింద ఈడీ దర్యాప్తు చేయవచ్చు. ఏదైనా కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత లావాదేవీల్లో మోసం, కుట్ర జరిగిందనడానికి ఆధారాలు ఉంటే ఈడీ కేసు నమోదు చేయవచ్చు. జార్ఖండ్‌లోని రాంచీ సదర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో వివరాల ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ ఆ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేసింది. ప్రస్తుతం ముడా కుంభకోణంలో సిద్ధరామయ్యపై నేరుగా ఎలాంటి కేసు నమోదు కాలేదు. దీనిపై లోకాయుక్త విచారణ జరుపుతోంది. లోకాయుక్త త్వరలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. ఎఫ్‌ఐఆర్ నమోదైతే దాని ఆధారంగా మోసం, కుట్ర జరిగిందనడానికి ఆధారాలు ఉంటే ఈడీకి కేసు నమోదు చేసే హక్కు ఉంటుంది. ప్రస్తుతం ముడా కేసులో సిద్ధరామయ్యపై విచారణ చేయాలని గవర్నర్‌కు దరఖాస్తు చేసిన దరఖాస్తుదారుడు లోక్‌యుక్త సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ముడా కేసు విచారణలో ఏం జరగబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Sep 27 , 2024 | 03:00 PM