ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lawrence Bishnoi: అతడిని ఎన్ కౌంటర్ చేస్తే కోటి రివార్డు.. పోలీసులకు కర్ణిసేన ఓపెన్ ఆఫర్..

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:01 PM

ప్రస్తుతం రాజ్ షెకావత్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసుకు కోటి 11లక్షల 11వేల 11వందల 11 రూపాయిల రివార్డ్ ఇస్తామని తెలిపారు. కర్ణిసేనకు చెందిన సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి..

Lawrence Bishnoi

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే రూ. 1,11,11,111 రివార్డు ఇస్తామంటూ కర్ణిసేన బహిరంగంగా ప్రకటించింది. క్షత్రియ కర్ణిసేన జాతీయ అధ్యక్షులు రాజ్ షేకావత్ ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం రాజ్ షెకావత్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసుకు కోటి 11లక్షల 11వేల 11వందల 11 రూపాయిల రివార్డ్ ఇస్తామని తెలిపారు. కర్ణిసేనకు చెందిన సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు సూత్రధారుడు, పాత్రధారుడు లారెన్స్ బిష్ణోయ్ అంటూ రాజ్ షేకావత్ వీడియోలో పేర్కొన్నారు. అదే సమయంలో దేశ ప్రజలకు భయం లేని భారతదేశం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు భయం లేకుండా జీవించాలంటే లారెన్స్ బిష్ణోయ్ వంటి వ్యక్తులు ఉండకూడదని తెలిపారు. ప్రజలను భయపెట్టే వ్యక్తులతో దేశానికి ఎప్పుడూ ప్రమాదమేనన్నారు. బిష్ణోయ్ గ్యాంగ్ అరాచకాలు వెలుగులోకి రావడంతో ప్రస్తుతం కర్ణిసేన లారెన్స్ బిష్ణోయ్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు మాట్లాడుతున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

CM Chandrababu: గిరిజన ప్రాంతాల అభివృద్ది, పథకాల ప్రగతిపై సమీక్షించిన సీఎం


గోగమేడి హత్యకు బాధ్యత..

కర్ణిసేనకు చెందిన సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి గత ఏడాది డిసెంబర్5న జైపూర్‌లో హత్యకు గురయ్యారు. ఆయన హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గోల్డీ బ్రార్ బాధ్యత వహించాడు. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గోగమేడిని రెండు మూడు సార్లు హెచ్చరించినా వినలేదని.. దీంతో కాల్చి చంపినట్లు గోల్డీ బ్రార్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే పోలీసులకు కోటి రూపాయిల రివార్డు అందిస్తామంటూ కర్ణి సేనకు చెందిన రాజ్ షెకావత్ మాట్లాడారు. పలు కేసుల్లో దోషిగా ఉన్న లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు. జైలు నుంచి పలు హత్యలకు బిష్ణోయ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

జగన్‌.. దమ్ముంటే అసెంబ్లీకి రా!


బాబా సిద్ధిఖీ హత్యతో..

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్ ఈ ఏడాది అక్టోబర్ 12న ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీని హత్య చేశారు. హీరో సల్మాన్ ఖాన్‌ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చాలాసార్లు బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. ఎన్నో హత్యలకు కారకుడైన లారెన్స్ బిష్ణోయ్‌ ఎన్‌కౌంటర్ విషయాన్ని కర్ణిసేన తెరపైకి తీసుకువచ్చింది.


ఎవరీ లారెన్స్ బిష్ణోయ్

లారెన్స్‌ బిష్ణోయ్‌ 1993లో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లా ధత్తరన్‌వాలిలో పుట్టాడు. ఇతడి తండ్రి హరియాణా పోలీస్‌ కానిస్టేబుల్‌. కృష్ణ జింకలను అమితంగా ఆరాధించే బిష్ణోయ్‌ వర్గానికి చెందిన లారెన్స్‌ చండీగఢ్‌లోని పంజాబ్‌ యూనివర్సిటీలో చదివే సమయంలో విద్యార్థి నాయకుడు. ఇదే కమ్రంలో గోల్డీ బ్రార్‌ పరిచయమై నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. కాలేజీ గ్యాంగ్‌ వార్‌లో తన స్నేహితురాలిని సజీవ దహనం చేయడం.. లారెన్స్‌లో తీవ్ర కసిని పెంచింది. రాజస్థాన్‌లో కృష్ణ జింకలను చంపిన కేసులో నిందితుడైన సల్మాన్‌ఖాన్‌ను హత్య చేసేందుకు ప్రణాళిక వేయడం ద్వారా లారెన్స్‌ వార్తల్లోకెక్కాడు. ఇతడి గ్యాంగ్‌ కార్యకలాపాలు పంజాబ్‌, ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లకు విస్తరించాయి.

ఉచిత ఇసుక దుర్వినియోగం కావొద్దు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 22 , 2024 | 12:01 PM