ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kathmandu : నేపాల్‌ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి

ABN, Publish Date - Jul 15 , 2024 | 04:57 AM

నేపాల్‌ నూతన ప్రధాన మంత్రిగా కేపీ శర్మ ఓలి(72) ఆదివారం నియమితులయ్యారు. చైనా సానుభూతిపరుడిగా పేరొందిన ఓలి నేపాల్‌ ప్రధాని కావడం ఇది నాలుగో సారి. పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ నేతృత్వంలోని....

కాఠ్మాండూ, జూలై 14 : నేపాల్‌ నూతన ప్రధాన మంత్రిగా కేపీ శర్మ ఓలి(72) ఆదివారం నియమితులయ్యారు. చైనా సానుభూతిపరుడిగా పేరొందిన ఓలి నేపాల్‌ ప్రధాని కావడం ఇది నాలుగో సారి. పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ నేతృత్వంలోని ప్రభుత్వంపై పార్లమెంట్‌లో పెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం నెగ్గింది.

275 ’సీట్లున్న నేపాల్‌ పార్లమెంట్‌లో 194 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. కేవలం 66 మంది మాత్రమే ప్రచండ నాయకత్వానికి ఓటేశారు. దీంతో నూతన ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది.

ఈ క్రమంలోనే కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని సీపీఎన్‌-యూఎంఎల్‌, నేపాలీ కాంగ్రెస్‌ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కేపీ శర్మ ఓలి ప్రమాణ స్వీకారం సోమవారం జరగనుంది. కాగా, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుపై నేపాలీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు షేర్‌ బహదూర్‌ దెవ్‌బా, సీపీఎన్‌-యూఎంఎల్‌ చైర్మన్‌ కేపీ శర్మ ఓలి గతవారమే ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం తర్వాత తొలి 18 నెలలు ఓలి ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత పార్లమెంట్‌ గడువు ముగిసే వరకు దేవ్‌బా ప్రధానిగా కొనసాగుతారు.

Updated Date - Jul 15 , 2024 | 04:57 AM

Advertising
Advertising
<