ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sundarkand recitaion: సుందరకాండ పారాయణలో పాల్గొన్న కేజ్రీవాల్ దంపతులు

ABN, Publish Date - Jan 16 , 2024 | 04:08 PM

దేశ రాజధానిలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ''సుందరకాండ పారాయణం'' నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పురాతన శ్రీ బాలాజీ మందిర్‌లో మంగళవారంనాడు జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన భార్య సునీత పాల్గొన్నారు.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ''సుందరకాండ పారాయణం'' (Sundarakand recitation) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పురాతన శ్రీ బాలాజీ మందిర్‌లో మంగళవారంనాడు జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), ఆయన భార్య సునీత (Sunita) పాల్గొన్నారు. చిరాగ్ ఢిల్లీలో జరిగిన పారాయణ కార్యక్రమంలో ఢిల్లీ మంత్రి సౌరబ్ భరద్వాజ్ పాల్గొన్నారు.


అసెంబ్లీ నియోజకవర్గాలు, మున్సిపాలిటీ వార్డులతో కలిసి మొత్తం 2,600 చోట్ల ఈ సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని 'ఆప్' నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలు సిటీలో ప్రతి మంగళవారంనాడు జరుగనున్నాయి. వీటి నిర్వహణ కోసం 'ఆప్' ఒక ఆర్గనైజేషన్‌ను కూడా ఏర్పాటు చేసింది.


కేజ్రీవాల్‌కు ఇంకా అందని ఆహ్వానం..

కాగా, అయోధ్యలో ఈనెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఇంతవరకూ సీఎంకు ఎలాంటి ఆహ్వానం అందలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, కొద్దిరోజుల క్రితం సీఎంకు ఒక లేఖ వచ్చిందని, అయోధ్య కార్యక్రమానికి తేదీలు అందుబాటులో ఉంచుకోవాలని, లాంఛనపూర్వక ఆహ్వానం, ఇతర వివరాలు తరువాత తెలియజేస్తామని ఆ లేఖలో ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి.

Updated Date - Jan 16 , 2024 | 04:08 PM

Advertising
Advertising