కేరళలో మరో మంకీపాక్స్ కేసు
ABN, Publish Date - Sep 28 , 2024 | 04:36 AM
తమ రాష్ట్రంలో ఈ ఏడాది రెండో మంకీపాక్స్(ఎంపాక్స్) కేసు నమోదైనట్లు కేరళ ప్రకటించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: తమ రాష్ట్రంలో ఈ ఏడాది రెండో మంకీపాక్స్(ఎంపాక్స్) కేసు నమోదైనట్లు కేరళ ప్రకటించింది. యూఏఈ నుంచి ఎర్నాకుళం వచ్చిన 26ఏళ్ల వ్యక్తిలో ఈ వైర్‌సను గుర్తించారు. అతడి రక్త నమూనాలు పుణెలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కి పంపారు. దీంతో అది ప్రాణాంతకక్లేడ్ 1బీ వైరసా లేక క్లేడ్ 2బీ వైరసా అన్నది తేలనుంది. హరియాణాలోని హిస్సార్‌కు చెందిన యువకుడిలో ఈ ఏడాది తొలిసారి ఎంపాక్స్ వైరస్‌ను గుర్తించారు.
Updated Date - Sep 28 , 2024 | 04:36 AM