ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

West Bengal: కోల్‌కతా హత్యాచార ఘటన.. ఆసుపత్రి సూపరింటెండెంట్ తొలగింపు

ABN, Publish Date - Aug 11 , 2024 | 05:59 PM

కోల్‌కతా హత్యాచార ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నగరంలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్‌ను పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ఆదివారం విధుల నుంచి తొలగించింది.

ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దారుణం జరిగిన ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్‌ను పశ్చిమ బెంగాల్ (West Bengal) ఆరోగ్య శాఖ ఆదివారం విధుల నుంచి తొలగించింది. సుదీర్ఘకాలంగా ఆసుపత్రి సుపరింటెంట్‌గా పనిచేస్తున్న డా. సంజయ్ వశిష్టను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాలేజీ డీన్‌ బుల్బుల్ ముఖోపాధ్యాయ్‌కు ఈ బాధ్యతలను అప్పగించింది (Kolkata medical college superintendent removed after trainee doctors' incident ).

DK Siva Kumar: తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు


మెడికల్ కాలేజీ సెమినార్ హాల్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న బాధితురాలి మృతదేహాన్ని తొలుత గుర్తించారు. ఆ తరువాత పోస్టు మార్టంలో వైద్య విద్యార్థినిపై హత్యాచారం జరిగినట్టు తేలిసింది. పోలీసులు నిందితుడిని శనివారం అరెస్టు చేశారు. మరోవైపు, ఈ ఉదంతం రాష్ట్రంలో పెను దుమారానికి దారి తీసింది. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మెడికల్ కాలేజీ విద్యార్థులు, వైద్యులు నిరసన చేపట్టారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించిందంటూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. క్యాంపస్‌లో సెక్యూరిటీ పెంచాలంటూ తాము గతంలో చేసిన అనేక అభ్యర్థనలు బుట్టదాఖలయ్యాయని వాపోయారు.


మరోవైపు, ఘటనపై స్పందించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దర్యాప్తును వేగవంతం చేయాలని డిమాండ్ చేసింది. ఘటనకు బాధ్యులను 48 గంటల్లోపు అరెస్టు చేయకపోతే దేశవ్యాప్త నిరసనలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించింది. నేరం, దానికి దారి తీసిన పరిస్థితులపై నిష్ఫాక్షిక దర్యా్ప్తు జరగాలని డిమాండ్ చేసింది. మహిళా డాక్టర్ల భద్రత పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరింది.

కాగా, నిందితుడు సంజయ్ రాయ్‌పై అత్యాచారం, హత్య సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడు ఆసుపత్రికి చెందిన వ్యక్తి కాదని, తరచూ ఆ పరిసరాల్లో కనిపించేవాడని దర్యాప్తులో తేలింది. నిందితుడికి ఎట్టిపరిస్థితుల్లో మరణ శిక్ష పడేలా చూస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఘటనపై స్పందించిన బీజేపీ, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వ్యవస్థ విఫలమైందంటూ అధికార టీఎమ్‌సీని దుయ్యబట్టింది.

Read National and Telugu News

Updated Date - Aug 11 , 2024 | 06:14 PM

Advertising
Advertising
<