బెంగాల్‌లో మరో దారుణం..నర్సుపై లైంగిక వేధింపులు

ABN, Publish Date - Sep 02 , 2024 | 03:46 AM

పశ్చిబెంగాల్‌ రాష్ట్రం బీర్భం జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో విధుల్లో ఉన్న నర్సుతో ఓ రోగి అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది.

బెంగాల్‌లో మరో దారుణం..నర్సుపై లైంగిక వేధింపులు

  • రాత్రి విధుల్లో ఉన్న నర్సు.. సెలైన్‌ ఎక్కిస్తుండగా వేధించిన రోగి అబ్బాస్‌

కోల్‌కతా, సెప్టెంబరు 1: పశ్చిబెంగాల్‌ రాష్ట్రం బీర్భం జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో విధుల్లో ఉన్న నర్సుతో ఓ రోగి అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. అబ్బాస్‌ ఉద్దీన్‌ అనే వ్యక్తి జ్వరంతో బాధపడుతుండడంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు ఇలాంబజార్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతనికి సెలైన్‌ ఎక్కించడానికి వార్డుకు తరలించారు. అక్కడ నర్సు సెలైన్‌ ఎక్కిస్తుండగా అబ్బాస్‌ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. తాకరాని చోట తాకడంతో పాటు అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. ‘‘ఆ రోగి నన్ను లైంగికంగా వేధించాడు. దుర్భాషలాడాడు. చాలా భయమేసింది’’ అని నర్సు వాపోయారు. ఈ ఘటనతో ఆస్పత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అబ్బా్‌సను అరెస్టు చేశారు. మరోవైపు, హౌరా జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌ సిటీ స్కాన్‌ కోసం వచ్చిన 13 ఏళ్ల బాలికను వేధించాడు. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొన్నారు.

Updated Date - Sep 02 , 2024 | 03:46 AM

Advertising
Advertising