ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lalu Prasad Yadav: ప్రధాని మోదీ హిందువు కాదు.. లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Mar 03 , 2024 | 08:57 PM

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై (PM Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ హిందువు కాదని, తల్లి చనిపోయిన తర్వాత ఆయన గుండు కొట్టించుకోలేదని అన్నారు. సాధారణంగా తల్లి చనిపోయాక ప్రతి హిందువు గుండు చేయించుకుంటారని, కానీ మోదీ మాత్రం అలా చేయలేదని, కాబట్టి ఆయన హిందువు కాదని దుయ్యబట్టారు.

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై (PM Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ హిందువు కాదని, తల్లి చనిపోయిన తర్వాత ఆయన గుండు కొట్టించుకోలేదని అన్నారు. సాధారణంగా తల్లి చనిపోయాక ప్రతి హిందువు గుండు చేయించుకుంటారని, కానీ మోదీ మాత్రం అలా చేయలేదని, కాబట్టి ఆయన హిందువు కాదని దుయ్యబట్టారు. అసలు మోదీ ఎందుకు గుండు కొట్టించుకోలేదు? అని ప్రశ్నించారు. బిహార్‌లోని పాట్నాలో ఆదివారం (03/03/24) నిర్వహించిన జన్ విశ్వాస్ ర్యాలీ (Jan Vishwas Rally) సందర్భంగా.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


ప్రధాని మోదీ దేశంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని, తనకు కుటుంబం లేకపోవడం వల్లే ఆయన కుటుంబ రాజకీయాలకు (Dynasty Politics) వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని లాలూ ప్రసాద్ యాదవ్ ధ్వజమెత్తారు. కుటుంబ రాజకీయాలపై ఎల్లప్పుడూ దాడి చేసే మోదీకి.. పిల్లలు గానీ, కుటుంబం గానీ ఎందుకు లేరని నిలదీశారు. ఎక్కువ మంది పిల్లలున్న వారిపై మాత్రం ‘పరివార్‌వాద్’ అంటూ విమర్శలు చేస్తుంటారని.. పాలిటిక్స్‌లో ఉన్న వాళ్లు కేవలం కుటుంబ రాజకీయాల కోసం పాటు పడుతుంటారని వ్యాఖ్యలు చేస్తుంటారని మోదీపై విరుచుకుపడ్డారు. అసలు మోదీ హిందువే కాదని మరోసారి ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా విద్వేషాన్ని మోదీ పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) సైతం మోదీపై ఫైర్ అయ్యారు. బీజేపీ నాయకులు అబద్ధాలు చెప్తారని, అందరినీ మోసం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. పేడని సర్వ్ చేసి, క్యారెట్ హల్వా అని చెప్పుకునే రకం బీజేపీ నాయకులని దుయ్యబట్టారు. రైల్వే వనరులతో పాటు ఉద్యోగ అవకాశాల్ని లాలూ ప్రసాద్ యాదవ్ దోచుకున్నారని మోదీ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఇండియన్ రైల్వేస్‌కు రూ.90వేల కోట్ల లాభాల్ని తన తండ్రి తీసుకొచ్చారని కౌంటర్ ఇచ్చారు.

Updated Date - Mar 03 , 2024 | 08:57 PM

Advertising
Advertising