ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : అల్విదా కామ్రేడ్‌!

ABN, Publish Date - Sep 15 , 2024 | 03:09 AM

వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంతిమయాత్ర ముగిసింది. వామపక్షాల అగ్రనేతలు, నాయకులు, వేలాది కార్యకర్తలు అంతిమయాత్రలో పాల్గొని, అణగారినవర్గాల కోసం జీవితాంతం పోరాడిన ఎర్రసూరీడు ఏచూరికి చివరి వీడ్కోలు పలికారు.

  • ముగిసిన ఏచూరి అంతిమయాత్ర

  • ఎయిమ్స్‌కు భౌతికకాయం అప్పగింత

  • సోనియా, పవార్‌, అఖిలేశ్‌ నివాళులు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంతిమయాత్ర ముగిసింది. వామపక్షాల అగ్రనేతలు, నాయకులు, వేలాది కార్యకర్తలు అంతిమయాత్రలో పాల్గొని, అణగారినవర్గాల కోసం జీవితాంతం పోరాడిన ఎర్రసూరీడు ఏచూరికి చివరి వీడ్కోలు పలికారు. శనివారం మధ్యాహ్నం పార్టీ ప్రధాన కార్యాలయం ఏకే గోపాలన్‌ భవన్‌ నుంచి ఏచూరిరాజకీయ ప్రస్థానం ప్రారంభించిన 14-అశోకారోడ్‌(సీపీఎం మాజీ కేంద్రకార్యాలయం) వరకు జరిగిన అంతిమయాత్ర.. అక్కడి నుంచి ఎయిమ్స్‌ వరకు కొనసాగింది. ఏచూరి భౌతికకాయాన్ని వైద్య బోధన, పరిశోధనల కోసం ఎయిమ్స్‌ అధికారులకు అప్పగించారు. సహచర కామ్రేడ్‌కు అంతిమ వీడ్కోలు పలుకుతూ సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కరాట్‌, మాణిక్‌ సర్కార్‌, పినరయి విజయన్‌, బృందాకరాట్‌, బీవీ రాఘవులు, సుభాషిణీ అలీ తదితరులు అంతిమయాత్రను ముందుండి నడిపించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆ పార్టీ నేతలు బి.మధు, తమ్మినేని వీరభద్రం, శ్రీనివాసరావు, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, టి.సాగర్‌, డీజీ నర్సింహారావు అంతిమయాత్రలో పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 03:11 AM

Advertising
Advertising