ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నీట్‌పై చర్చిద్దాం

ABN, Publish Date - Jul 03 , 2024 | 04:19 AM

పార్లమెంటు సమావేశాల చివరి రోజైన బుధవారం నీట్‌పై లోక్‌సభలో చర్చకు అనుమతించాలని ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ విజ్ఞప్తి చేశారు.

మోదీకి రాహుల్‌ ప్రతిపాదన

సభను ఒకరోజు ముందే వాయిదా వేసిన సర్కారు

ప్రధానికి మంగళవారం ఉదయం రాహుల్‌ లేఖ

షెడ్యూల్‌కు ఒకరోజు ముందే సభ నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ, జూలై 2: పార్లమెంటు సమావేశాల చివరి రోజైన బుధవారం నీట్‌పై లోక్‌సభలో చర్చకు అనుమతించాలని ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రధానికి లేఖ రాశారు. జూన్‌ 28న అలాగే సోమవారం ఈ అంశంపై చర్చిద్దామని ప్రతిపక్షం కోరగా అనుమతించలేదని అందులో పేర్కొన్నారు. నీట్‌ సమస్యకు ఒక నిర్మాణాత్మక పరిష్కారం కనుగొనడమే తమ ఉద్దేశమని లేఖలో పేర్కొన్నారు. అయితే, స్పీకర్‌ ఓంబిర్లా మంగళవారమే(షెడ్యూల్‌ కంటే ఒకరోజు ముందే) నిరవధిక వాయిదా వేశారు. దీంతో, నీట్‌పై ఎలాంటి చర్చ లేకుండానే లోక్‌సభ నిరవధికంగా వాయిదాపడింది. కాగా, జాతీయ పరీక్ష ఏజెన్సీ(నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) డైరెక్టర్‌ని మార్చడం, ఇతర పరీక్షలను వాయిదా వేయడం వల్ల ఉపయోగం లేదని, అవి మన పరీక్షల విధానంలో ఉన్న తీవ్రమైన లోపాలను కప్పిపుచ్చే చర్యలు మాత్రమేనని రాహుల్‌ మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఉన్నత విద్యా వ్యవస్థలో నెలకొన్న తీవ్రమైన లోపాలు నీట్‌ ద్వారా బయటపడ్డాయన్నారు. లక్షలాది కుటుంబాలు తమ పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేశాయని, పేపర్‌ లీక్‌లు వారి కలలను కల్లలు చేశాయన్నారు. నీట్‌పై వారిలో నమ్మకం కలిగించడానికి పార్లమెంటులో చర్చే తొలిమెట్టు అన్నారు. ఈ అంశం ప్రాధాన్యత దృష్ట్యా బుధవారమే లోక్‌సభలో చర్చ చేపట్టాలన్నారు. అయితే మంగళవారమే సభ నిరవదిక వాయిదా పడింది.

రాహుల్‌ ‘హిందూ’ వ్యాఖ్యల తొలగింపు

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో రాహుల్‌ చేసిన ప్రసంగం నుంచి కొన్ని భాగాలను తొలగించారు. స్పీకర్‌ ఓం బిర్లా ఆదేశాల మేరకు రాహుల్‌ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. హిందువులు, ప్రధాని మోదీ, బీజేపీ, ఆరెస్సె్‌సలపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు సహా మరికొన్నింటిని తొలగించినట్లు వెల్లడించారు. దీనిపై రాహుల్‌ గాంధీ స్పీకర్‌కు లేఖ రాశారు. తన ప్రసంగంలో నుంచి ‘ఎంపిక చేసిన వ్యాఖ్యల’ను మాత్రమే తొలగించారని ఆరోపించారు. ఇది పార్లమెంటు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. ‘రికార్డుల నుంచి తొలగించిన నా వ్యాఖ్యలను పునరుద్ధరించాలని కోరుతున్నా’ అని రాహుల్‌ స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. తాను చెప్పినవన్నీ నిజాలని రాహుల్‌ విలేకరులతో చెప్పారు.

Updated Date - Jul 03 , 2024 | 04:20 AM

Advertising
Advertising