ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress: నితీశ్ రాజీనామాపై స్పందించిన ఖర్గే... ఏమన్నారంటే..

ABN, Publish Date - Jan 28 , 2024 | 12:17 PM

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాపై(Nitish Kumar Resign) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) ఘాటుగా స్పందించారు. కలబురిగిలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. దేశంలో ఆయా రామ్, గయా రామ్‌లాంటి రాజకీయ నేతలు ఎక్కువైపోయారని పరోక్షంగా నితీశ్‌ని ఉద్దేశించి అన్నారు.

కలబురిగి: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాపై(Nitish Kumar Resign) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ఘాటుగా స్పందించారు. కలబురిగిలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. దేశంలో ఆయా రామ్, గయా రామ్‌లాంటి రాజకీయ నేతలు ఎక్కువైపోయారని పరోక్షంగా నితీశ్‌ని ఉద్దేశించి అన్నారు.

"మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ నాతో నితీశ్ వెళ్లిపోతున్నారని చెప్పారు. ఈ విషయం మాకు ముందే తెలుసు. ఇండియా కూటమికి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ విషయాన్ని బయటకి చెప్పలేదు. అలా చెబితే ప్రత్యర్థులు ప్రజల్లోకి తప్పుడు సంకేతాన్ని పంపుతారు' అని ఖర్గే అన్నారు.

కాగా, జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడు, సీఎం నితీశ్ కుమార్ రాజ్‌భవన్‌‌లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు తన రాజీనామాను అందజేశారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం పట్నాలోని పార్టీ కార్యాలయంలో జరుగుతోంది. జేడీయూ.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇవాళ రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తదితర అగ్రనేతలు రానున్నారు. కూటమి ఏర్పాటు అనంతరం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వీరు చర్చించనున్నారు.

ప్రస్తుత బలాబలాలివి..

ఆర్జేడీ - 79

బీజేపీ - 78

JD(U) - 45

కాంగ్రెస్ - 19

CPI (ML) - 12

హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) - 4

సీపీఐ - 2

సీపీఐ (ఎం) - 2

స్వతంత్ర ఎమ్మెల్యే - 1

Updated Date - Jan 28 , 2024 | 12:17 PM

Advertising
Advertising