ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections 2024: పలు రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులు: సీఈసీ

ABN, Publish Date - Apr 02 , 2024 | 05:20 PM

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అలాంటి వేళ పలు కీలక రాష్ట్రాల్లో నిఘా పెంచడంతోపాటు పరిపాలన, భద్రత, అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు (Elections 2024 ) సమీపిస్తున్నాయి. అలాంటి వేళ పలు కీలక రాష్ట్రాల్లో నిఘా పెంచడంతోపాటు పరిపాలన, భద్రత, అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను నియమిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Election commission of india) మంగళవారం వెల్లడించింది. అందుకోసం మాజీ అఖిల భారత సర్వీస్ అధికారులతోపాటు మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఉన్నతాధికారుల సేవలను వినియోగించుకుంటున్నట్లు తెలిపింది.

ఈ ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు ధన ప్రభావం, కండ బలం, తప్పుడు సమాచారం తదితర అంశాలపై దృష్టి సారిస్తారిని ఈసీ తెలిపింది. ఏడు కోట్ల జనాబా కలిగిన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రతోపాటు బీహార్‌కు పంపుతున్నట్లు పేర్కొంది. అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సైతం వీరిని పంపతున్నామని ప్రకటించింది.

అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎన్నికల సంబంధిత ఖర్చులపై నిఘా కోసం ప్రత్యేక వ్యయ పరిశీలకులను నియమిస్తున్నట్లు తెలిపింది. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుప్రీయపై బీజపీ నాయకుడు దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యల పట్ల వివరణ కోరినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను అతిక్రమించవద్దని సూచించింది. మరోవైపు సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి మార్చి 29వ తేదీ వరకు 79 వేల ఫిర్యాదులు అందాయని చెప్పింది. లోక్‌సభ ఎన్నికలు 2024 ఎన్నికల తేదీ ప్రకటించిన నాటి నుంచి అంటే మార్చి 16వ తేదీ నుంచి ఇన్ని వేల ఫిర్యాదులు అందాయని పేర్కొంది.

Updated Date - Apr 02 , 2024 | 05:48 PM

Advertising
Advertising