ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections: ఎన్నికల బందోబస్తుపై ఈసీ నజర్‌.. పోలీస్‌ ఉన్నతాధికారులతో భేటీ

ABN, Publish Date - Mar 01 , 2024 | 11:22 AM

త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు కోసం 15 కంపెనీల పారామిలిటరీ బలగాలు శుక్రవారం నగరానికి రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు పోలీస్‌ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

చెన్నై: త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు కోసం 15 కంపెనీల పారామిలిటరీ బలగాలు శుక్రవారం నగరానికి రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు పోలీస్‌ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌ ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులో భాగంగా చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌(Chief Election Commissioner Rajeev Kumar) సారథ్యంలోని సీఈసీ బృందం నగరానికి వచ్చి కలెక్టర్లు, పోలీస్‌ ఉన్నతాఽధికారులతో పాటు అఖిలపక్ష నేతలతో సమావేశం నిర్వహించి, ఎన్నికల తేదీలపై అభిప్రాయాలను సేకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు గురువారం ఉదయం సచివాలయంలోని ఆడిటోరియంలో పోలీస్‌ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎక్సైజ్‌, క్రైమ్‌ విభాగం ఏడీజీపీ మహేష్‌ కుమార్‌ అగర్వాల్‌, సాయుధ విభాగం ఏడీజీపీ జయరాం, సీఐఎ్‌సఎఫ్‌ ఐజీ శరవణన్‌ తదితరులు పాల్గొన్నారు. ఇందులో రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జులుగా మహేష్‌ కుమార్‌ అగర్వాల్‌, జయరాంలను నియమించారు. దీంతో వీరిద్దరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్యంగా శుక్రవారం నగరానికి రానున్న 15 కంపెనీల పారామిలిటరీ బలగాలను ఏఏ ప్రాంతాలకు తరలించాలి? తదితర అంశాలపై చర్చించారు. అంతేకాకుండా, ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Updated Date - Mar 01 , 2024 | 11:22 AM

Advertising
Advertising