Maratha Quota: తలొగ్గిన మహా సర్కార్...16న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ABN, Publish Date - Feb 12 , 2024 | 02:27 PM
మరాఠా రిజర్వేషన్ ఆందోళన తీవ్రమవుతుండటంతో దీనిపై ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 16న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుంది. దీనికి ముందు ఓబీసీ కమిషన్ సర్వే రిపోర్టుపై చర్చిందేందుకు మంత్రివర్గ సమావేశాన్ని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఏర్పాటు చేయనున్నారు.
ముంబై: మరాఠా రిజర్వేషన్ (Maratha Quota) ఆందోళన తీవ్రమవుతుండటంతో దీనిపై ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి (Assembly special session) మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 16న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుంది. దీనికి ముందు ఓబీసీ కమిషన్ సర్వే రిపోర్టుపై చర్చిందేందుకు మంత్రివర్గ సమావేశాన్ని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి రిజర్వేషన్ ఉద్యమనేత మనోజ్ జారంగే డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
కొనసాగుతున్న నిరాహార దీక్ష
కుంబి మరాఠాల రక్త సంబధీకులపై రూపొందించిన డ్రాప్ట్ నోటిఫికేషన్‌ను చట్టం చేయాలని, ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మనోజ్ జారంగే ఆదివారంనాడు మరోసారి డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరేంత వరకూ నిరాహార దీక్షను కొనసాగిస్తామన్నారు. తన స్వగ్రామమైన జల్నా జిల్లా అంతర్వాలి సరటి గ్రామంలో ఆయన శనివారం ఆందోళన ప్రారంభించారు. ఓబీసీ గ్రూపింగ్ కింద మరాఠా కమ్యూనిటీని చేర్చాలనే డిమాండ్‌పై జారంగే నిరాహార దీక్షకు దిగడం ఏడాదిలో ఇది నాలుగో సారి. ఇటీవల ముంబై వరకూ తలపెట్టిన భారీ మార్చ్ జనవరి 26న ముంబై సరిహద్దుల్లో ముగిసింది. ముసాయిదా నోటిఫికేషన్‌ను సీఎం చూపించడంతో ఆయన వెనుదిరిగారు. నోటిఫికేషన్‌ను చట్టం చేసేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని, నిరసనకారులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కూడా ఆయన నిరాహార దీక్షను కొనసాగించారు.
Updated Date - Feb 12 , 2024 | 02:27 PM