Anil Arora Suicide: బాలీవుడ్ నటి తండ్రి ఆత్మహత్య..
ABN, Publish Date - Sep 11 , 2024 | 01:48 PM
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా తండ్రి అనీల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలో తాను నివాసం ఉంటున్న భవనం ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా తండ్రి అనీల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలో తాను నివాసం ఉంటున్న భవనం ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలియగానే బాంద్రా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మలైకా తండ్రి కొతంకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అనీల్ అరోరా ఆత్మహత్య చేసుకునే సమయంలో ఇంట్లో మలైకా లేరు. ఆమె పూణేలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే అనీల్ అరోరా కుమార్తె మలైకా వెంటనే పూణే నుంచి ముంబైకి బయలుదేరారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న అనీల్ అరోరా ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. తీవ్ర ఆందోళనకు గురై ఆయన బిల్డింగ్‌పైకి వెళ్లి దూకేశారా లేదా ఈ ఆత్మహత్య వెనుక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Amit Shah: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై అమిత్ షా ట్వీట్..
మలైకా అరోరా 11 ఏళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. మలైకాకు ఓ సోదరి ఉంది. విడాకుల అనంతరం పిల్లలు ఇద్దదూ తన తల్లి వద్ద పెరిగారుు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రం ఎక్కువుగా మలైకా తన తండ్రితో కనిపించేది. అనీల్ అరోరా మర్చంట్ నావీలో పనిచేశారు. 2022లో మైలకా ఓ ఇంటర్వ్యూలో తన బాల్యం గురించి చెప్పారు. తన జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారో ఆమె వివరించారు. తన తల్లిదండ్రులు అనీల్ అరోరా, జాయిస్ పాలీకార్ప్ తనకు 11 ఏళ్ల వయసులోనే విడాకులు తీసుకున్నారని గుర్తు చేసుకుంటూ.. ఆ తర్వాత ఆమె ఎలా పెరిగిందనే విషయాన్ని వివరించారు. అనీల్ అరోరా విడాకులు తీసుకునే సమయానికి ఆరేళ్ల వయసున్న తన సోదరి అమృతతో పాటు మలైకా థానే నుంచి చెంబూర్ వెళ్లి తల్లి వద్ద పెరిగారు. తన బాల్యం ఎంతో అద్భుతమైనప్పటికీ.. అది అంత సులభంగా సాగలేదన్నారు. కష్ట సమాయాలు ముఖ్యమైన పాఠాలను నేర్పుతాయని మలైకా తన ఇంటర్వ్యూలో తెలిపారు.
Trainee Doctor Father: సీఎం కోరినా బెంగాల్లో దుర్గాపూజను ఎవరూ జరుపుకోరన్న ట్రైనీ డాక్టర్ తండ్రి!
తల్లిదండ్రుల విడాకుల తర్వాత..
మలైకా అరోరా తల్లితండ్రులు విడిపోయిన తర్వాత తాను జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ఆమె తెలిపారు. ఎన్నో విలువలు నేర్చుకున్నానని, తన జీవితంలో నేర్చుకున్న విషయాలు తన వృత్తి ప్రయాణంలో ఎంతగానో ఉపయోగపడినట్లు తెలిపారు. తాను ఇప్పటికీ చాలా స్వతంత్రంగా ఉంటానని.. అదే సమయంలో స్వేచ్ఛకు ఎక్కువ విలువ ఇస్తానని మలైకా అరోరా గతంలో తెలిపారు. మలైకా అరోరా చివరిగా ఆయుష్మాన్ ఖురానా, జైదీప్ అహల్వత్ నటించిన యాక్షన్ హీరో చిత్రంలో 'ఆప్ జైసా కోయి' పాటలో కనిపించింది. ఆమె 'తేరా హి ఖయాల్' మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది. త్వరలో రాబోయే మల్టీస్టారర్ హౌస్‌ఫుల్ 5 లో కూడా ప్రత్యేక అతిధి పాత్రలో మలైకా కనిపించనుంది.
Digital Lottery: డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం.. రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Nationa News and Latest Telugu News
Updated Date - Sep 11 , 2024 | 01:48 PM