ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Varanasi: 24 గంటల పాటు తపస్సు! కాళీ మాత ప్రత్యక్షం కాలేదని ఆత్మహత్య

ABN, Publish Date - Dec 11 , 2024 | 10:00 PM

కాళీ మాత ప్రత్యక్ష్యం కావాలంటూ 24 గంటల పాటు ధ్యానం చేసిన ఓ వ్యక్తి జగన్మాత అనుగ్రహం కలగలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన వారణాసిలో తాజాగా వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: కాళీ మాత ప్రత్యక్ష్యం కావాలంటూ 24 గంటల పాటు తపస్సు చేసిన ఓ వ్యక్తి జగన్మాత అనుగ్రహం కలగలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన వారణాసిలో తాజాగా వెలుగు చూసింది. గాయ్‌ఘాట్ పతంగలి ప్రాంతంలో ఉన్న అమిత్ శర్మ తన గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. రక్తమోడుతున్న అమిత్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు స్థానిక పోలీసులు తెలిపారు (UP).

Convoy Collision: సీఎం కాన్వాయ్‌ని ఢీకొట్టిన కారు.. గాయపడిన వారితోపాటు సీఎం


జాతీయ మీడియా కథనాల ప్రకారం, అమిత్‌కు కాళీ మాత అంటే అపరిమితమైన భక్తి. ఈ నేపథ్యంలో శనివారం అతడు తన గదిలో కాళీ మాత కోసం తపస్సు ప్రారంభించాడు. కాళీ మాత తన ముందు ప్రత్యక్షం అవుతుందని అతడు చెప్పాడట. తల్లీ.. ప్రత్యక్షం అవ్వు.. అంటూ ధ్యానం సందర్భంగా అతడు ఉచ్చరించాడట. అయితే, ఎన్ని గంటలు గడిచినా జగన్మాత ప్రత్యక్షం కాకపోవడంతో నిరాశకు గురైన అతడు చివరకు కత్తితో తన గొంతు కోసుకున్నాడని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఇషాన్ సోనీ పేర్కొన్నారు.

Mamata Banerjee: నాపై గౌరవానికి కృతజ్ఞతలు: మమతా బెనర్జీ


అమిత్ గత ఏడేళ్లుగా తన ఇంట్లోనే ఉంటున్నట్టు ఆ ఇంటి యజమాని తెలిపాడు. తరచూ తీర్థయాత్రలకు వెళ్లేవాడని, కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించే వాడని పేర్కొన్నారు. ఇక అమిత్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పంపించామని, ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Read Latest and National News

Updated Date - Dec 11 , 2024 | 10:49 PM