ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైద్య విద్యార్థులకు అధిక శ్రమ వద్దు

ABN, Publish Date - Aug 16 , 2024 | 05:28 AM

వైద్య విద్యార్థులతో ఎక్కువ గంటలు ఆస్పత్రుల్లో పనిచేయించడం వారి భౌతిక, మానసిక ఆరోగ్యం పాలిట ముప్పు అని జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) టాస్క్‌ఫోర్స్‌ స్పష్టం చేసింది. వారికి వారంలో 74 గంటల కంటే ఎక్కువ పని అప్పగించకూడదని సూచించింది. వైద్య విద్యార్థులకు రోజులో 7 నుంచి 8 గంటల

వారంలో 74 గంటల కంటే ఎక్కువ పని వద్దు.. వారాంతపు సెలవులు ఇవ్వాల్సిందే

ఎన్‌ఎంసీ టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

న్యూఢిల్లీ, ఆగస్టు 15: వైద్య విద్యార్థులతో ఎక్కువ గంటలు ఆస్పత్రుల్లో పనిచేయించడం వారి భౌతిక, మానసిక ఆరోగ్యం పాలిట ముప్పు అని జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) టాస్క్‌ఫోర్స్‌ స్పష్టం చేసింది. వారికి వారంలో 74 గంటల కంటే ఎక్కువ పని అప్పగించకూడదని సూచించింది. వైద్య విద్యార్థులకు రోజులో 7 నుంచి 8 గంటల మేర కనీస నిద్ర అవసరమని పేర్కొంది. కంటినిండా నిద్ర లేకుంటే.. వారు భౌతిక, మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని హెచ్చరించింది. వైద్య విద్యార్థులు సెలవులు అడిగితే.. భేషరతుగా ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది. పీజీ విద్యార్థులు, ఇంటర్న్‌షి్‌పలో ఉన్నవారు విద్యను అభ్యసించే క్రమంలో ఆస్పత్రుల్లో పనిచేస్తారని, వైద్యుల కొరతను తీర్చడానికి కాదని ఆ నివేదికలో తేల్చిచెప్పింది. వైద్య విద్యార్థులు మానసిక ఆరోగ్యంపై ఏర్పాటైన ఎన్‌ఎంసీ టాస్క్‌ఫోర్స్‌ నివేదికలోని కీలకాంశాలు..

  • రోగుల సంఖ్య పెరిగినప్పుడు విద్యార్థులపై ఒత్తిడి పెంచడం, వారితో అదనపు గంటలు పనిచేయించడం కాకుండా.. సీనియర్‌ రెసిడెంట్లు, వైద్యాధికారులను నియమించుకోవాలి. అందుకు తగ్గట్లుగా విభాగాధిపతులు, ఫ్యాకల్టీ, సీనియర్‌ రెసిడెంట్లు, రెసిడెంట్లు ప్రణాళికలను రూపొందించుకోవాలి

  • పీజీ విద్యార్థులకు రెండు వారాలు, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు నాలుగు వారాల చొప్పున ఓరియెంటేషన్‌ కార్యక్రమాలను నిర్వహించాలి

  • మానసిక ఆరోగ్యం కోసం యోగాలో శిక్షణనివ్వాలి

  • విద్యార్థులకు ఉచితవైద్య చికిత్సలను అందజేయాలి

  • ర్యాగింగ్‌ నిర్మూలన విషయంలో ఎన్‌ఎంసీ నిబంధనలను కఠినంగా పాటించాలి

  • బ్యాక్‌లాగ్‌ల ఒత్తిడి లేకుండా సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలి. విద్యార్థుల ఫలితాలను రోల్‌ నంబర్ల ద్వారా ప్రకటించాలి

  • స్పెషలిస్టుల డిమాండ్‌ ఉన్న విభాగాల్లో పీజీ సీట్లను పెంచాలి

  • 24 గంటలూ విద్యార్థులకోసం సపోర్ట్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి

  • ప్రతి 500 మంది విద్యార్థులకు కనీసం ఇద్దరు కౌన్సెలర్లను నియమించాలి

  • వైద్య విద్యార్థుల సమస్యలపై ఫిర్యాదులకు ఒక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలి.

Updated Date - Aug 16 , 2024 | 05:28 AM

Advertising
Advertising
<