ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Narendra Modi: జమ్ముకశ్మీర్‌లో ప్రధాని మోదీ ఈవెంట్.. బెదిరించి మరీ జనాల్ని సమీకరించారు

ABN, Publish Date - Mar 07 , 2024 | 04:07 PM

జమ్ముకశ్మీర్: శ్రీనగర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ర్యాలీ కోసం జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) ప్రభుత్వం బలవంతంగా జనాలను సమీకరించిందని మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti), ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఆరోపణలు గుప్పించారు. సబ్-జీరో ఉష్ణోగ్రతలో బుద్గాం బస్ స్టాండ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల్ని వాహనాల్లోకి తరలించబడ్డారని ముఫ్తీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్: శ్రీనగర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ర్యాలీ కోసం జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) ప్రభుత్వం బలవంతంగా జనాలను సమీకరించిందని మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti), ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఆరోపణలు గుప్పించారు. సబ్-జీరో ఉష్ణోగ్రతలో బుద్గాం బస్ స్టాండ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల్ని వాహనాల్లోకి తరలించబడ్డారని ముఫ్తీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని సైతం ఆమె షేర్ చేశారు. ‘‘2019 తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయని చూపించుకోవడం కోసం.. ప్రధాని మోదీ ఈవెంట్‌కి ప్రభుత్వ ఉద్యోగుల్ని బలవంతంగా సమీకరిస్తున్నారు. ఈ జనాలందరూ తమ అవమానాన్ని ఈ ఈవెంట్‌లో జరుపుకోబోతున్నారు. ఈ పరిస్థితిని చూస్తుంటే బాధగా ఉంది’’ అని ముఫ్తీ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.


గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee), డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh) చేసిన ప్రదర్శనలకు భిన్నంగా ప్రధాని మోదీ ర్యాలీ ఉందని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (People Democratic Party - PDP) చీఫ్ మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. గతంలో నిర్వహించిన ఈవెంట్స్‌కి సామాన్య ప్రజలు ఎంతో ఉత్సాహంగా వేదికల వద్దకు తరలి వచ్చారని, ఎన్నో ఆశలతో తమ ఇళ్లకు తిరిగి వెళ్లారని గుర్తు చేశారు. కానీ.. ఈసారి బక్షి స్టేడియంలో (Bakshi Stadium) జరిగే ఈవెంట్‌లో చట్టవిరుద్ధంగా రద్దు చేసిన ‘ఆర్టికల్ 370’పై (Article 370) సో-కాల్డ్ ప్రయోజనాల గురించి మాట్లాడతారన్న విషయం కశ్మీరులకు తెలుసని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రధాన నియోజకవర్గంతో పాటు భారత్‌లోని మిగిలిన ప్రాంతాల్లో బీజేపీని (BJP) బలోపేతం చేసుకోవడం కోసమే ఈ పర్యటన ఉద్దేశించబడిందని ముఫ్తీ అభిప్రాయపడ్డారు.

ఇక నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) నాయకుడు ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) బుధవారం మాట్లాడుతూ.. ఏ ఉద్యోగులైతే ప్రధాని ఈవెంట్‌కి హాజరుకారో, వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయా శాఖాధిపతులు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఈవెంట్‌కు జనాల్ని సమీకరించడం కోసం నియంతృత్వ జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయపడుతోందని పేర్కొన్నారు. సాధారణంగా ఒక ఈవెంట్‌లో పాల్గొనాలా వద్దా అనేది ఒక ఆప్షనల్ అని, కానీ ఇక్కడ మోదీ ఈవెంట్‌కి తప్పనిసరిగా వెళ్లాలని బెదిరిస్తున్నారని చెప్పారు. గడ్డకట్టే ఉష్ణోగ్రతలో ఉద్యోగులను తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటు చేశారని ఒమర్ అబ్దుల్లా తన ట్వీట్‌లో చెప్పుకొచ్చారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 04:07 PM

Advertising
Advertising