Microsoft: విండోస్ సమస్యను పరిష్కరించాం
ABN, Publish Date - Jul 19 , 2024 | 09:02 PM
విండోస్ సమస్యను పరిష్కరించినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్‌కు కారణమైన క్రౌడ్ స్ట్రయిక్‌ను వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. దీనికి డిబగ్ రూపొంచామని.. దాంతో సమస్య పరిష్కరమైందని వెల్లడించింది.
విండోస్ సమస్యను పరిష్కరించినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్‌కు కారణమైన క్రౌడ్ స్ట్రయిక్‌ను వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. దీనికి డిబగ్ రూపొంచామని.. దాంతో సమస్య పరిష్కరమైందని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించింది. దీంతో సిస్టమ్‌లు షట్ డౌన్ అయి.. రీస్టార్ట్ అయినాయి. క్రౌడ్ స్ట్రయిక్ అనేది ఓ సెక్యూరిటీ సంస్థ.. ఇది విండోస్‌కు అడ్వాన్స్ సెక్యూరిటీ అందిస్తుంది. అయితే బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్య సైబర్ దాడి కాదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. క్రౌడ్ స్ట్రయిక్ సంస్థ ఇచ్చిన కొత్త ఆఫ్ డేట్ కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు వివరించింది. అలాగే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలని విషయాన్ని సైతం సోదాహరణగా వివరించింది.
Also Read: Visakhapatnam: పిల్లల అల్లరి మాన్పించే క్రమంలో మృత్యు ఒడిలోకి ‘తండ్రి’
Also Read: Kanwar Yatra 2024: యూపీ ప్రభుత్వంపై ప్రియాంక మండిపాటు
మరోవైపు విండోస్‌లో సమస్య ఏర్పడడంతో బ్యాంకులు, విమానయ సంస్థలు, టెలికాం, మీడియా రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక ఆన్‌లైన్ సేవలు సైతం స్తంభించాయి. ఇక ఎయిర్‌పోర్ట్‌ల్లో సేవలు నిలిచిపోవడం వల్ల పలు విమానాలు రద్దయ్యాయి. లండన్‌లో స్టాక్ ఎక్సేంజ్ సైతం పని చేయలేదు. ఆస్ట్రేలియాలో న్యూస్ చానెళ్లు ప్రసారమవుతూ.. ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో ఆ దేశ ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక మైక్రోసాఫ్ట్‌పై యాపిల్ సంస్థ అధినేత స్టీవ్ జాబ్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సంస్థ విజయవంతమైందన్నారు. అయితే ఆ సంస్థ నాసిరకం ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకు వస్తుందని ఆయన పేర్కొన్నారు.
Air India Passengers: రష్యాలో చిక్కుకున్న ప్రయాణికులు.. వారి కోసం బయలుదేరి విమానం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 19 , 2024 | 09:08 PM