ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాక్‌లో ప్రయాణికుల వాహనాలపై మిలిటెంట్ల కాల్పులు

ABN, Publish Date - Nov 22 , 2024 | 06:50 AM

పాకిస్థాన్‌లో ప్రయాణికులు వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు జరపడంతో కనీసం 50 మంది మరణించారు. వారిలో అయిదుగురు పిల్లలు, ఎనిమిది మంది మహిళలు

50 మంది మృతి

వారిలో అయిదుగురు పిల్లలు, ఎనిమిది మంది మహిళలు

పెషావర్‌, నవంబరు 21: పాకిస్థాన్‌లో ప్రయాణికులు వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు జరపడంతో కనీసం 50 మంది మరణించారు. వారిలో అయిదుగురు పిల్లలు, ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. మరో 20 మంది గాయపడ్డారు. మృతుల్లో అధికులు షియా వర్గానికి చెందిన వారు. ఆఫ్గానిస్థాన్‌కు సరిహద్దులో ఉన్న ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ కుర్రం జిల్లాలో గురువారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తాలిబన్ల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో మిలిటెంట్లు మాటు వేసి ఒకేసారి కాల్పులు జరిపారు. పరాచినార్‌ నుంచి పెషావర్‌కు సుమారు 200 వ్యాన్లు వరుసగా ఒక శ్రేణి మాదిరిగా పోలీసు సంరక్షణలో వెళ్తున్న సమయంలో గుళ్ల వర్షం కురిపించారు. ఈ సంఘటనను ఖైబర్‌ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్‌ ఖాన్‌ గండాపూర్‌ ఖండించారు. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్నవారిని విడిచిపెట్టబోమని తెలిపారు.

Updated Date - Nov 22 , 2024 | 06:50 AM