ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నవమి వేడుకలపై మోదీ వర్సెస్‌ మమత!

ABN, Publish Date - Apr 17 , 2024 | 02:59 AM

శ్రీరామనవమి వేడుకల విషయమై ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బెంగాల్‌లో శ్రీరామ నవమి వేడుకలను మమత ప్రభుత్వం అడ్డుకుంటోందని మోదీ

పండుగను అడ్డుకుంటున్న బెంగాల్‌ ప్రభుత్వం: ప్రధాని

రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించే యత్నాలు: బెంగాల్‌ సీఎం

కోల్‌కతా, ఏప్రిల్‌ 16: శ్రీరామనవమి వేడుకల విషయమై ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బెంగాల్‌లో శ్రీరామ నవమి వేడుకలను మమత ప్రభుత్వం అడ్డుకుంటోందని మోదీ ఆరోపించారు. దీనిని మమత తిప్పికొట్టారు. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు. శ్రీరామ నవమి సందర్భంగా ర్యాలీ చేసుకోవడానికి వీహెచ్‌పీకి కోల్‌కతా హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే, గత ఏడాది ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రదర్శన మార్గాన్ని మార్చాలని బెంగాల్‌ ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో మోదీ, మమత మాటల యుద్ధానికి దిగారు. మంగళవారం బలూర్‌ఘాట్‌లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. ‘‘కోర్టు ర్యాలీ చేసుకోవచ్చని చెప్పింది కాబట్టి బుధవారం భక్తి శ్రద్ధలతో ప్రదర్శనను విజయవంతం చేయాలి’’ అని పిలుపునిచ్చారు. నవమి వేడులకు అనుమతివ్వని తృణమూల్‌ ప్రభుత్వం... ర్యాలీపై రాళ్లు వేసేవారికి మాత్రం అనుమతిస్తోందని మండిపడ్డారు. మరోవైపు, బీజేపీ ఒత్తిడితోనే ఎన్నికల సంఘం రాష్ట్రంలో అధికారులను మార్చేసిందని, ఇప్పుడేదైనా ఉద్రిక్తతలు తలెత్తితే దానికి ఈసీయే బాధ్యత వహించాలని మమత పునరుద్ఘాటించారు.

Updated Date - Apr 17 , 2024 | 02:59 AM

Advertising
Advertising