‘ఆయుష్మాన్’లో వృద్ధులకు మరిన్ని ప్రయోజనాలు
ABN, Publish Date - Oct 14 , 2024 | 06:17 AM
దేశంలో 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకం కింద 70 ఏళ్లు పైబడిన
న్యూఢిల్లీ, అక్టోబరు 13: దేశంలో 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకం కింద 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు మరిన్ని ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్‌హెచ్‌ఏ) భావిస్తోంది. ఏబీ-పీఎంజేఏవైలో ప్రస్తుతం జనరల్ మెడిసిన్, సర్జరీ, ఆంకాలజీ, కార్డియాలజీ వంటి 27 రకాల స్పెషాలిటీల్లో 1,949 వైద్య సేవలతో సమగ్ర కవరేజీని అందిస్తున్నారు. అయితే 70 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించే అల్జీమర్స్, చిత్తవైకల్యం వంటి కొన్ని మానసిక సమస్యలకు అవసరమైన చికిత్స కూడా ఈ పథకంలో అందించాలని ఎన్‌హెచ్‌ఏ భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Updated Date - Oct 14 , 2024 | 06:17 AM