ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముడుపుల కేసులో అదానీలపై ఒక్క ఆధారమూ లేదు

ABN, Publish Date - Nov 28 , 2024 | 04:46 AM

గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీపై అమెరికాలో పెట్టిన ముడుపుల కేసుల్లో ఒక్క ఆధారం కూడా లేదని ప్రముఖ న్యాయకోవిదులు ముకుల్‌ రోహత్గీ (మాజీ అటార్నీ జనరల్‌), మహేశ్‌ జెఠ్మలానీ(రాజ్యసభ సభ్యుడు) అన్నారు.

న్యాయకోవిదులు ముకుల్‌ రోహత్గీ, మహేశ్‌ జెఠ్మలానీ ధ్వజం

న్యూఢిల్లీ, నవంబరు 27: గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీపై అమెరికాలో పెట్టిన ముడుపుల కేసుల్లో ఒక్క ఆధారం కూడా లేదని ప్రముఖ న్యాయకోవిదులు ముకుల్‌ రోహత్గీ (మాజీ అటార్నీ జనరల్‌), మహేశ్‌ జెఠ్మలానీ(రాజ్యసభ సభ్యుడు) అన్నారు. అమెరికా న్యాయ శాఖ అభియోగాల్లో స్పష్టత, నిర్దిష్టత లోపించాయన్నారు. ప్రతిపక్షాలు దీనిపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. వారిద్దరూ కలిసి బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘అమెరికా కోర్టులో మొత్తం ఐదు అభియోగాలున్నాయి. మొదటి, ఐదో కేసులు వీటిలో ముఖ్యమైనవి. వీటిలో అదానీల పేర్లు లేనే లేవు. 2,3 కేసుల్లో అదానీ పేర్లు ఉన్నాయి. మౌలికంగా ఇవి సెక్యూరిటీలు, బాండ్లకు సంబంధించినవి. విద్యుత్‌ సరఫరా, కొనుగోళ్ల వ్యవహారంలో భారతీయ అధికారులకు అదానీలు ముడుపులిచ్చాన్నది ప్రధాన ఆరోపణ. అయితే ఎవరికి లంచాలిచ్చారు.. ఏ రూపంలో ముడుపులు ముట్టజెప్పారు. సదరు అధికారి ఏ శాఖకు చెందినవారో అందులో ఒక్క పేరు గానీ, వివరం గానీ లేవు’ అని రోహత్గీ వ్యాఖ్యానించారు. ‘మహారాష్ట్ర ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నాక.. ఆ పరాజయం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్‌, ఇండీ కూటమి అదానీ వ్యవహారాన్ని వాడుకుంటున్నాయి. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా.. విదేశీ ప్రమేయం ఉన్న అదానీ, మణిపూర్‌ అంశాలపైనే అవి దృష్టిపెట్టాయి’ అని మహేశ్‌ జెఠ్మలానీ విమర్శించారు.

Updated Date - Nov 28 , 2024 | 04:46 AM