ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mumbai Police: 12 రోజులు.. 1200 కిలోమీటర్ల వేట.. కట్ చేస్తే..

ABN, Publish Date - Jan 11 , 2024 | 06:26 PM

ముంబై, జనవరి 11: 12 రోజులు.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 1200 కిలోమీటర్ల పాటు గాలింపు.. ఎట్టకేలకు రెండు హత్యల కేసులో నిందితుడిని పట్టుకున్నారు ముంబై పోలీసులు. మలాడ్ వెస్ట్‌లో తన భార్యను, సోదరుడిని హత్య చేసి పారిపోయిన నిందితుడు డ్రేసన్ ఎం దాస్‌ను చివరకు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో పట్టుకున్నారు.

Mumbai Police

ముంబై, జనవరి 11: 12 రోజులు.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 1200 కిలోమీటర్ల పాటు గాలింపు.. ఎట్టకేలకు రెండు హత్యల కేసులో నిందితుడిని పట్టుకున్నారు ముంబై పోలీసులు. మలాడ్ వెస్ట్‌లో తన భార్యను, సోదరుడిని హత్య చేసి పారిపోయిన నిందితుడు డ్రేసన్ ఎం దాస్‌ను చివరకు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో పట్టుకున్నారు.

మలాడ్ వెస్ట్‌ ప్రాంతానికి చెందిన నిందితుడు డ్రేసన్, అతని అన్న డామియన్‌కు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ విషయంలోనే ఇరు కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే డిసెంబర్ 29వ తేదీన ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. ఆ సమయంలో అతను తన భార్య చిత్ర(35), అన్న డామియన్‌పై దాడి చేసి చంపేశాడు. ఇంట్లో ఉన్న పూల కుండితో తలపై కొట్టి, కత్తులతో వారిద్దరినీ పొడిచేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు డ్రేసన్. ఈ ఘటనలో చిత్ర స్పాట్‌లోనే చనిపోగా.. తీవ్రంగా గాయయపడిన డామియన్‌ కోమాలోకి వెళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల తరువాత ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఈ ఘటనపై డామియన్ భార్య బిందు బంగూర్ నగర్ లింక్ రోడ్ పోలీస్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో కేసు నమోదు చేసుకున్న హత్యలు చేసి పరారైన డ్రేసన్ కోసం సెర్చింగ్ మొదలు పెట్టారు.

కానీ, పోలీసులకు చుక్కలు చూపించాడు డ్రేసన్. టెక్నాలజీని ఉపయోగించినా.. అతన్ని ట్రేస్ చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. చాలా తెలివిగా ఫోన్ వినియోగించకుండా.. బ్యాంక్ కార్డ్స్ కూడా ఉపయోగించకుండా తప్పించుకుని తిరిగాడు. దాంతో డ్రేసన్‌ను ట్రాక్ చేయడం, ట్రేస్ చేయడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది.

మరింత ఫోకస్ పెట్టిన పోలీసులు.. సాధ్యమైనంత మేరకు అన్ని కోణాల్లో అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే.. అతను పారిపోయిన స్థలం నుంచి సీసీటీవీలను పరిశీలించడం మొదలుపెట్టారు. అతను ప్రతి కదలికను సీసీ కెమెరాలో గమనించారు. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరకు పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో నిందితుడు డ్రేసన్‌ను గుర్తించారు పోలీసులు. దేశ సరిహద్దులు దాటి బంగ్లాదేశ్, నేపాల్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. పోలీసులు అతన్ని పట్టుకున్నారు. కోల్‌కతా పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ సహాయంతో డ్రేసన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని అక్కడి నుంచి ముంబైకి తీసుకువచ్చారు. మొత్తంగా నిందితుడు డ్రేసన్‌ను పట్టుకునేందుకు పోలీసులు 12 రోజుల పాటు పలు రాష్ట్రాల్లో వెతుకుతూ 1200 కిలోమీటర్లు ట్రాక్ చేశారు. చివరకు వారి ప్రయత్నం ఫలించింది. నిందితుడు పట్టుబడ్డాడు. దాంతో అతన్ని రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Jan 11 , 2024 | 06:27 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising