Mumbai: ఐస్‌క్రీమ్‌లో చేతి వేలు... పోలీసులను ఆశ్రయించిన డాక్టర్
ABN, Publish Date - Jun 13 , 2024 | 02:01 PM
తింటున్న ఐస్‌క్రీమ్‌లో చేతి వేలు ఉండడాన్ని గమనించి డాక్టర్ నిర్ఘాంత పోయారు. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తులో భాగంగా ఐస్‌క్రీమ్‌లోని చేతి వేలును పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
తింటున్న ఐస్‌క్రీమ్‌లో చేతి వేలు ఉండడాన్ని గమనించి డాక్టర్ నిర్ఘాంత పోయారు. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తులో భాగంగా ఐస్‌క్రీమ్‌లోని చేతి వేలును పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ ఘటన ముంబై మహానగరంలో చోటు చేసుకుంది.
పశ్చిమ మలాడ్‌లో నివసిస్తున్న డాక్టర్ (26) భోజనం అనంతరం ఆన్‌లైన్‌లో బటర్ స్కాచ్ కోన్ ఐస్‌క్రీమ్ కోసం ఆర్డర్ పెట్టారు. ఇంటికి వచ్చిన ఐస్‌క్రీమ్ తింటుండగా.. అందులో అర అంగుళం మేర చేతి వేలు ఉండడాన్ని గమనించారు. ఆ చేతి వేలుకి గోరుతోపాటు కండ పట్టి చర్మం ఉండడంతో.. డాక్టర్ ఒకింత ఆందోళనకు గురయ్యారు. దీంతో డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: Varanasi: సొంత నియోజకవర్గంలో మోదీ పర్యటన
ఆ క్రమంలో చేతి వేలును పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అయితే ఈ చేతి వేలు.. ఎవరిది? మనుషుల దేనా?. ఐస్‌క్రీమ్‌లోకి ఎలా వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా ఐస్‌క్రీమ్ కంపెనీ సిబ్బందిని సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 13 , 2024 | 02:33 PM