Rohit: కోట్లలో ఆస్తులు.. ఆడి కారు.. విమానంలో టూర్లు..
ABN, Publish Date - Jul 06 , 2024 | 03:38 PM
కాలం కలిసొచ్చినంత సేపు.. మనం ఏం చేసినా చెల్లుతుంది. అదే కాలం కొద్దిగా కలిసి రాకుంటే.. ఎక్కడ పడాలో అక్కడే పడేటట్లు చేస్తుంది. అదే జరిగింది. రోహిత్ కనుబాయి సోలంకి విషయంలో. ఒక ఊరు, ఒక ప్రాంతం, ఒక రాష్ట్రమన్నట్లుగా కాకుండా.. చాలా రాష్ట్రాల్లో తన చోర కళను ప్రదర్శించాడు.
కాలం కలిసొచ్చినంత సేపు.. మనం ఏం చేసినా చెల్లుతుంది. అదే కాలం కొద్దిగా కలిసి రాకుంటే.. ఎవరైనా ఎక్కడ పడాలో అక్కడే పడేటట్లు చేస్తుంది. అదే జరిగింది. రోహిత్ కనుబాయి సోలంకి విషయంలో. ఒక ఊరు, ఒక ప్రాంతం, ఒక రాష్ట్రమన్నట్లుగా కాకుండా.. చాలా రాష్ట్రాల్లో తన చోర కళను ప్రదర్శించాడు. అలా అతగాడు ఇటీవల గుజరాత్ పోలీసులకు చిక్కాడు. ఆ క్రమంలో ‘అతడిని’ ఖాకీలు తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో చోర కళలోని అతడి హస్తప్రావీణ్యాన్ని చూసి కనిపించని నాలుగో సింహం సైతం ఆశ్చర్యపోయింది. దీంతో అతడిని.. అతడిలోని టాలెంట్‌ను చూసి ఖాకీలు సైతం ఈ సందర్బంగా ముక్కున వేలేసుకున్నారు.
పోలీసుల విచారణలో.. తనకు ముంబైలో విలాసవంతమైన ప్రాంతం ముంబ్రాలో ఒక ప్లాట్ ఉందని ఒప్పుకున్నాడు. దాని విలువ రూ. కోటి ఉంటుందని చెప్పాడు. అలాగే ఆడి కారు సైతం తనకుందన్నాడు. అయితే చోరీల కోసం విమానంలో ప్రయాణాలు చేస్తూ.. ఫైవ్ స్టార్ హోటళ్లలో దిగేవాడినని విచారణంలో సోలంకీ అంగీకరించాడు.
ఇక మొత్తం 19 చోరీ కేసుల్లో సోలంకి నిందితుడిగా ఉన్నాడు. వలసద్‌లో మూడు, సురత్‌లో ఒకటి, పోర్‌బందర్‌లో ఒకటి, సెల్వాల్‌లో ఒకటి. తెలంగాణలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు, మధ్యప్రదేశ్‌లో రెండు, మహారాష్ట్రలో ఒకటి చొప్పున అతడిపై చోరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు వివరించారు. ఇక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో సైతం పలు చోరీలకు సోలంకి పాల్పడినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ముస్లిం మహిళతో వివాహం కోసం సోలంకి తన పేరును అర్హన్‌గా మార్చుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు.
అయితే సోలంకికీ డ్రగ్స్ అలవాటు ఉందన్నారు. ముంబైలోని నైట్స్ క్లబులు, డ్యాన్స్ బార్లలో గడుపుతూ.. అతడు జీవితాన్ని ఖుషీ ఖుషీ చేసేవాడని గుజరాత్ పోలీసులు తెలిపారు. ఇక అతడి ఒక నెల ఖర్చు రూ.1.50 లక్షలు ఉందని సోలంకి చెప్పాడని పోలీసులు చెప్పారు.
మొత్తం 64 కళల్లో చోర కళ కూడా ఉంది. ఆ కళకు .. వేష భాషలు, ప్రాంతాలతో పట్టింపు లేదని రోహిత్ కనూబాయి సోలంకి.. తన చర్యల ద్వారా రుజువు చేశారని విషయం స్పష్టమవుతుంది. వాపీలో రూ. లక్ష చోరీ జరిగింది. ఈ కేసులో అతడిని గుజరాత్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో అతడు.. తన గత చరిత్రను పోలీసుల ముందు వివరించాడు.
For Latest News and National News click here
Updated Date - Jul 06 , 2024 | 04:12 PM