Nalin Prabhat : జమ్మూకశ్మీర్ ప్రత్యేక డీజీపీగా నళిన్ ప్రభాత్
ABN, Publish Date - Aug 16 , 2024 | 05:17 AM
సమర్థుడైన ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందిన నళిన్ ప్రభాత్ (55)ను జమ్మూకశ్మీర్ ప్రత్యేక పోలీసు డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. తక్షణమే ఆ బాధ్యతలను
ఆయన ఏపీ క్యాడర్ అధికారి
న్యూఢిల్లీ, ఆగస్టు 15: సమర్థుడైన ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందిన నళిన్ ప్రభాత్ (55)ను జమ్మూకశ్మీర్ ప్రత్యేక పోలీసు డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. తక్షణమే ఆ బాధ్యతలను చేపట్టాలని ఆదేశించింది. ప్రస్తుత డీజీపీ ఆర్‌ఆర్ స్వయిన్ సెప్టెంబరు 30న పదవీ విరమణ చేసిన వెంటనే ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆయనను హోంశాఖ కేంద్రపాలిత ప్రాంతాల కేడర్‌కు మూడేళ్లపాటు డిప్యుటేషన్‌పై పంపింది. జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కావడంతో ఈ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఉమ్మడి ఏపీలో నక్సలైట్ల సమస్యను ఎదుర్కోవడంలో సమర్థంగా వ్యవహరించారు. గ్రేహౌండ్స్, సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్‌లో పనిచేశారు. ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎ్‌సజీ) డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న ఆయనను కాలపరిమితి ముగియకుండానే జమ్మూకశ్మీర్‌కు పంపింది. ఆయనకు 3 పోలీసు గ్యాలెంటరీ మెడల్స్, పరాక్రమ్ పతకం, ఇతర మెడల్స్ లభించాయి. సవాళ్లను ఎదుర్కోవడంలో ఽధైర్య సాహసాలను ప్రదర్శించడంతోపాటు అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తారన్న పేరు ఆయనకు ఉంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం ప్రబలడంతో దాన్ని అణచివేతకు నళిన్ ప్రభాత్‌ను కేంద్రం ప్రత్యేకంగా ఎంపిక చేసినట్టు పరిశీలకులు భావిస్తున్నారు.
Updated Date - Aug 16 , 2024 | 05:17 AM