ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Madras HC: ప్రేమికుల మధ్య కిస్సెస్, హగ్స్ నేరం కాదు: మద్రాస్ హైకోర్టు

ABN, Publish Date - Nov 15 , 2024 | 03:48 PM

యువ జంటల మధ్య చుంబనాలు, ఆలింగనాలు సహజమేనని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ చర్యలను సెక్షన్ 354 ఏ(1)(i) కింద నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: యువ జంటల మధ్య చుంబనాలు, ఆలింగనాలు సహజమేనని మద్రాస్ హైకోర్టు (Madras High Court) అభిప్రాయపడింది. ఈ చర్యలను సెక్షన్ 354 ఏ(1)(i) కింద నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. లైంగికంగా వేధించాలనే ఉద్దేశంతో చేపట్టే చర్యలకే ఈ సెక్షన్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు న్యాయస్థానం.. ఓ యువకుడిపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టేసింది.

Madras High Court : భర్త తరఫున లంచం తీసుకుంటే భార్యకూ శిక్ష


కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం, సదరు యువకుడు 2020 నుంచి 19 ఏళ్ల యువతితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడు యువతిని ఓ చోటకు రమ్మని పిలిచాడు. అక్కడ వారిద్దరూ చాలా సేపు గడిపారు. అనంతరం, అర్ధరాత్రి సమయంలో యువకుడు ఆమెను ముద్దాడి, కౌగిలించుకున్నాడు. ఆ తరువాత యువతి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తనను పెళ్లి చేసుకోవాలని యువకుడిని కోరింది. దీన్ని తిరస్కరించిన యువకుడు ఆమెకు దూరమయ్యేందుకు ప్రయత్నిస్తుండటంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Viral: వ్యభిచారంపై వింత పిటిషన్.. ఖంగుతిన్న మద్రాస్ హైకోర్టు.. చివరకు షాకింగ్ తీర్పు


ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేశ్.. యువకుడి చర్యలకు సెక్షన్ 354 ఏ(1)(i) వర్తించదని అన్నారు. ప్రేమికుల మధ్య ఆలింగనాలు, చుంబనాలు సహజమేనని, ఈ కేసులో క్రిమినల్ ప్రోసీడింగ్స్‌కు అనుమతిస్తే చట్టాన్ని దుర్వినియోగపరిచినట్టేనని తీర్పు వెలువరించారు.

Read Latest National News and Telugu News

Updated Date - Nov 15 , 2024 | 04:51 PM