ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chhattisgarh: రూ.8 లక్షల రివార్డున్న నక్సలైట్ కమాండర్ నగేష్ లొంగుబాటు

ABN, Publish Date - Feb 26 , 2024 | 09:15 PM

పలు ప్రాణాంతక దాడుల్లో ప్రమేయమున్న నక్సలైట్ కమాండర్ నగేష్ అలియాస్ పెడకం ఎర్ర (38) సోమవారంనాడు లొంగిపోయాడు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పోలీసులు, సీఆర్‌పీఎఫ్ అధికారుల సమక్షంలో అతను సరెండర్ అయినట్టు ఎస్‌పీ కిరణ్ జి.చావన్ తెలిపారు.

సుక్మా: పలు ప్రాణాంతక దాడుల్లో ప్రమేయమున్న నక్సలైట్ కమాండర్ (Naxalite commander) నగేష్ (Nagesh) అలియాస్ పెడకం ఎర్ర (38) సోమవారంనాడు లొంగిపోయాడు. ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) లోని సుక్మా జిల్లాలో పోలీసులు, సీఆర్‌పీఎఫ్ అధికారుల సమక్షంలో అతను సరెండర్ అయినట్టు ఎస్‌పీ కిరణ్ జి.చావన్ తెలిపారు. మావోయిస్టుల అమానవీయ, శుష్క భావజాలానికి ఎర్ర విసిగిపోయి తనంతట తానే పోలీసుల ముందు లొంగిపోయినట్టు చెప్పారు. కాగా, జిల్లా అధికారుల తీసుకుంటున్న పునరావాస చర్యల పట్ల ఆకర్షితుడనయ్యానని ఎర్ర తెలిపాడు. అతని తలపై రూ.8 లక్షల రివార్డు ఉంది.


లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్ (ఎల్ఓసీ) సభ్యుడిగా 2003లో మావోయిస్డు ఉద్యమంలో ఎర్ర చేరాడు. 2015లో నక్సల్ కంపెనీ కమాండర్ ఆఫ్ పిల్ఎల్‌జిఎ బెటాలియన్‌ నెంబర్ వన్‌గా ఎదిగాడు. 2010లో తాడ్‌మెట్ల సామూహిక మారణకాండతో సహా పలు ప్రాణాంతక దాడుల్లో పాల్గొన్నాడు. తాడ్‌మెట్ల మారణకాండలో 76 మంది బల్యయారు. 2017లో బుర్కపాల్ దాడుల్లో 25 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా, లొంగిపోయిన ఎర్రకు రాష్ట్ర ప్రభుత్వ సరెండర్ అండ్ రిహాబిలేషన్ పథకం కింద పునరావాస సౌకర్యం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

Updated Date - Feb 26 , 2024 | 09:15 PM

Advertising
Advertising