ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్డీయేకు 150 సీట్లైనా రావు

ABN, Publish Date - Apr 18 , 2024 | 04:10 AM

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 150 సీట్లు మించి గెలవలేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తొలి విడత ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేష్‌ యాదవ్‌తో కలిసి ఆయన ఘజియాబాద్‌లో

పార్టీ ఆదేశిస్తే అమేథీ నుంచి పోటీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 150 సీట్లు మించి గెలవలేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తొలి విడత ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేష్‌ యాదవ్‌తో కలిసి ఆయన ఘజియాబాద్‌లో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. యూపీలో తమ మధ్య బలమైన ఐక్యత ఉన్నదని వారిరువురూ సంకేతాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. 15-20 రోజుల క్రితం బీజేపీకి 180 సీట్లు వస్తాయని అంచనా వేశామని, కానీ ప్రస్తుతం ఎన్డీయేకే 150 సీట్లు దాటవని అన్ని రాష్ట్రాల నుంచి అందుతున్న నివేదికల అధారంగా తేలిందని తెలిపారు. బీజేపీ పట్ల ప్రజావ్యతిరేకత చాప కింద నీరులాగా విస్తరిస్తోందని, రోజురోజుకూ ఇండియా కూటమి బలపడుతోందని ఆయన అన్నారు. యూపీలోని అమేథీ నుంచి కానీ రాయబరేలీ నుంచి కానీ మీరు పోటీ చేస్తారా అని విలేకరులు అడుగగా.. ఇది బీజేపీ ప్రశ్న అని రాహుల్‌ చమత్కరించారు. తానెక్కడి నుంచి పోటీ చేయాలన్నది పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. పార్టీ ఏ ఆదేశాలు ఇస్తే వాటిని పాటిస్తానని తెలిపారు. దేశంలో పేదరికం ఒక్క రోజులో మటుమాయం అవుతుందని తాము అనడం లేదని చెప్పారు.

యూపీలో బీజేపీని చిత్తు చేస్తాం

కాంగ్రెస్‌- ఎస్పీ పొత్తు అత్యంత శక్తివంతమైనదని ఎస్పీ నేత అఖిలే్‌షయాదవ్‌ అన్నారు. యూపీలో బీజేపీని తమ ఇండియా కూటమి చిత్తు చేస్తుందని ఆయన చెప్పారు. ఘజియాబాద్‌ నుంచి ఘాజిపూర్‌ వరకు బీజేపీని తుడిచిపెడుతుందని పేర్కొన్నారు. మైనారిటీ, దళిత, వెనుకబడిన వర్గాలే ఎన్డీయేని ఓడిస్తాయని అఖిలేష్‌ అన్నారు. కాగా, యూపీలోని 80 లోక్‌సభ స్థానాల్లో ఎస్పీ 62, కాంగ్రెస్‌ 17 చోట్ల పోటీ చేస్తుండగా, టీఎంసీకి కూడా ఎస్పీ ఓ సీటును కేటాయించింది. ఈ స్థానాలకు ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Updated Date - Apr 18 , 2024 | 04:10 AM

Advertising
Advertising