Everest: ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై బ్యాన్ విధించిన నేపాల్.. కారణం ఏంటో తెలుసా?
ABN, Publish Date - May 17 , 2024 | 01:08 PM
ఇటీవలే సింగపూర్, హాంకాంగ్‌లో నిషేధానికి గురైన భారత్‌కు చెందిన మసాలాల కంపెనీలు ఎవరెస్ట్ (Everest), ఎండీహెచ్ (MDH spices)కు మరో షాక్ తగిలింది. ఈ కంపెనీలపై తాజాగా నేపాల్ (Nepal) కూడా బ్యాన్ విధించింది. ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతులపై నిషేధం విధించినట్లు పేర్కొంది.
ఇటీవలే సింగపూర్, హాంకాంగ్‌లో నిషేధానికి గురైన భారత్‌కు చెందిన మసాలాల కంపెనీలు ఎవరెస్ట్ (Everest), ఎండీహెచ్ (MDH spices)కు మరో షాక్ తగిలింది. ఈ కంపెనీలపై తాజాగా నేపాల్ (Nepal) కూడా బ్యాన్ విధించింది. ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతులపై నిషేధం విధించినట్లు, మార్కెట్‌లో ఈ మసాలా దినుసుల అమ్మకాలను కూడా నిషేధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ తాజాగా ప్రకటించారు. ఈ మసాలా దినుసుల్లో హానికర రసాయనాలు ఉన్నట్టు బయటపడడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు (Ban On Everest, MDH Masala).
ఈ రెండు కంపెనీలకు చెందిన మసాలా దినుసుల్లో ఇథలిన్ ఆక్సైడ్ (Ethylene Oxide) మోతాదుకు మించి ఉన్నట్టు ఇటీవల తేలింది. క్రిమి సంహారకంగా ఉపయోగించే ఇథలిన్ ఆక్సైడ్ అవశేషాలు ఈ మసాలా దినుసుల్లో ఉన్నట్టు గుర్తించిన సింగపూర్ ప్రభుత్వం వాటిని వెంటనే భారత్‌కు తిరిగి పంపెయ్యాలని నిర్ణయించింది. దీంతో సింగపూర్, హాంకాంగ్ వీటిని నిషేధించాయి. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సైతం ఈ రెండు మసాలాలపై విచారణ జరుపుతున్నట్లు ఇటీవలే ప్రకటించాయి. ఆయా ఉత్పత్తులను ఆస్ట్రేలియా రీకాల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఎవరెస్ట్ సాంబార్ మసాలా, గరం మసాలాను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ 2023లో ఆదేశించింది. పలు దేశాలు నిషేధించిన ఆయా మసాలాలను భారత్‌లో కూడా విక్రయిస్తుండటంతో ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అప్రమత్తమైంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఈ కంపెనీలకు చెందిన మసాలాలను సేకరించి ప్రయోగశాలలో నమూనాలను పరీక్షిస్తోంది.
ఇవి కూడా చదవండి..
PIN Number: మీ పిన్ నెంబర్ ఇందులో ఉందేమో చూసుకోండి.. వెంటనే మార్చుకోకపోతే ప్రమాదం తప్పదు!
Viral Video: వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే.. విమానం నుంచి దిగుతున్న వ్యక్తికి షాకింగ్ అనుభవం!
మరిన్ని జాతీయ వార్తలు కోసం స్పందించండి..
Updated Date - May 17 , 2024 | 01:08 PM