ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

భారత్‌లో యూకే హైకమిషనర్‌‌గా లిండి కామెరాన్

ABN, Publish Date - Apr 11 , 2024 | 08:41 PM

భారత్‌లో బ్రిటీష్ హైకమిషనర్‌గా లిండి కామెరాన్ నియమితులయ్యారు. ఈ మాసంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు యునైటెడ్ కింగ్‌డమ్ హైకమిషన్ వెల్లడించింది. ఇప్పటి వరకు భారత్‌లో ఆ పదవిలో ఉన్న అలెక్స్ ఈలీస్‌ను బదిలీ చేసినట్లు వెల్లడించింది.

Lindy Cameron

న్యూఢిల్లీ, ఏప్రిల్11: భారత్‌లో బ్రిటీష్ హైకమిషనర్‌గా లిండి కామెరాన్ ( Lindy Cameron) నియమితులయ్యారు. ఈ మాసంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు యునైటెడ్ కింగ్‌డమ్ హైకమిషన్ (United Kingdom High Commission) వెల్లడించింది.

ఇప్పటి వరకు భారత్‌లో ఆ పదవిలో ఉన్న అలెక్స్ ఈలీస్‌ను బదిలీ చేసినట్లు వెల్లడించింది. లిండి కామెరాన్.. యూకేలో నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ముఖ్య కార్యనిర్వహాణాధికారిగా ఆమె ఇప్పటి వరకు విధులు నిర్వహించారని తెలిపింది.

Rajnath Singh: తల్లి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయా

అలాగే ఉత్తర ఐర్లాండ్ కార్యాలయంలో డైరెక్టర్ జనరల్‌గా కూడా ఆమె పని చేశారని వివరించింది. ఆమె నియమాకం వల్ల.. భారత్, యూకేల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆకాంక్షించింది. భారత్‌లో హై కమిషనర్‌గా నియమాకం కావడం పట్ల లిండి కామెరాన్ ఎక్స్ వేదిగాక సంతోషం వ్యక్తం చేశారు.

Paris Tour: ప్రజాధనంతో ప్యారిస్‌లో అధికారుల చక్కర్లు

ఇప్పటి వరకు భారత్‌లో యూకే హైకమిషనర్‌గా ఉన్న అలెక్స్ ఈలీస్‌ (Alex Ellis)కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే భారత్‌లోని యూకే బృందంతో పని చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు కామెరాన్ వెల్లడించారు.

Updated Date - Apr 11 , 2024 | 08:42 PM

Advertising
Advertising