ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Himanta Biswa Sarma: లవ్ జిహాద్‌పై కొత్త చట్టం.. అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు..

ABN, Publish Date - Aug 04 , 2024 | 09:26 PM

వివాదస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే అసోం సీఎం హిమంత బిస్వా శర్మ.. తాజాగా లవ్ జిహాద్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Himanta Biswa Sarma

వివాదస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే అసోం సీఎం హిమంత బిస్వా శర్మ.. తాజాగా లవ్ జిహాద్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ కేసుల్లో జీవిత ఖైదు విధించే చట్టాన్ని తమ ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతుందని హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. గౌహతిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చెప్పారు. అసోం శాసనసభలో దీనికి సంబంధించిన బిల్లు త్వరలోనే ప్రవేశపెడతామని తెలిపారు. మరోవైపు అసోం ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి కొత్త పాలసీని తీసుకవస్తుందన్నారు. ఈ విధానంలో అసోం రాష్ట్రంలో పుట్టిన వ్యక్తులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులుగా పరిగణించబడతారని సీఎం తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక అసోం వాసులకు ప్రాధాన్యత కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల్లో అసోం ప్రజలకు ప్రాధాన్యత కల్పిస్తామని హిమంత బిస్వా శర్మ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేస్తూ.. దీనికి సంబంధించిన నోటిఫికషన్లు త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

PM Kisan Samman Nidhi Yojana: రైతులకు శుభవార్త.. ఈ తేదీనే 19వ విడత కిసాన్ సమ్మాన్ నిధులు!


భూ విక్రయాలకు సంబంధించి..

ముస్లిం, హిందువుల మధ్య భూముల విక్రయానికి సంబంధించి అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. అలాగే కొద్దిరోజుల్లో అసోం ప్రభుత్వం విఐపి సంస్కృతికి అంతం పలకబోతుందన్నారు. అందరినీ సామాన్యులుగానే పరిగణించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో శాఖహారం మాత్రమే వడ్డిస్తారని, మాంసాహారాన్ని ఉపయోగించరన్నారు.

పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!


బర్త్ సర్టిఫికెట్‌తో పాటు ఆధార్..

అసోంలోని 13 వైద్య కళాశాలల్లో నవజాత శిశువులకు జనన ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డులను జారీ చేయడానికి అస్సాం ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తుందని సీఎం తెలిపారు. పుట్టిన కొద్ది రోజుల్లోనే నవజాత శిశువులకు ఆధార్ కార్డులు అందజేస్తామన్నారు. తొలుత జిల్లాలోని వైద్య కళాశాలల్లోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని, ఆ తర్వాత ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామని ప్రకటించారు. తద్వారా పిల్లలు పుట్టిన వెంటనే ఆధార్ కార్డు పొందుతారని, వారి కుటుంబ సభ్యులు ఆధార్ కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న యువత కోసం అసోం ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న యువతకు పరిశ్రమల స్థాపన కోసం రెండు లక్షల రూపాయలను ఇచ్చే పథకాన్ని ప్రారంభించామని, దీనికోసం మొదటి దశలో ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 5 వరకు జిల్లాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి సెప్టెంబర్ 30లోపు నిధులు పంపిణీ పూర్తిచేస్తామని శర్మ తెలిపారు.


Wall Collapsed: గోడ కూలి 9 మంది చిన్నారులు మృతి, ఇద్దరికి గాయాలు

Top 8 Floods India: దేశాన్ని కుదిపేసిన 8 ప్రధాన వరద సంఘటనలు..10 వేల మంది మృతి!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 04 , 2024 | 09:26 PM

Advertising
Advertising
<