ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మతమార్పిళ్లకు పాల్పడే ఎన్జీవోలపై కన్నెర్ర

ABN, Publish Date - Nov 13 , 2024 | 06:06 AM

బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడటం, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడే స్వచ్ఛంద సంస్థల(ఎన్జీవో) రిజిస్ట్రేషన్లను విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎ్‌ఫసిఆర్‌ఏ)-2010 ప్రకారం రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ, నవంబరు 12: బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడటం, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడే స్వచ్ఛంద సంస్థల(ఎన్జీవో) రిజిస్ట్రేషన్లను విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎ్‌ఫసిఆర్‌ఏ)-2010 ప్రకారం రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి ఎఫ్‌సిఆర్‌ఏ డైరక్టర్‌ కె.సంజయన్‌ ఈ నెల 8న నోటీసు విడుదల చేశారు. విదేశీ వ్యక్తులు, సంస్థల నుంచి విరాళాలు పొందే స్వచ్ఛంద సంస్థలు సామాజిక, మతపరమైన సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడితే ఎఫ్‌సిఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ కోల్పోతాయని స్పష్టం చేశారు. ఉగ్రవాద, రాడికల్‌ సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నా, కుట్రపూరితంగా నిరసనలు, అవాంఛనీయ కార్యకలాపాలతో అభివృద్ధి నిరోధక చర్యలకు పాల్పడినా ఎఫ్‌సిఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తామన్నారు. అంతేకాదు ఎఫ్‌సిఆర్‌ఏ చట్టం ప్రకారం ఆయా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు. విదేశీ వ్యక్తులు, సంస్థల నుంచి విరాళాలు పొందే స్వచ్ఛంద సంస్థలు తాము పెట్టుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ప్రాజెక్టులు చేపట్టకపోయినా ఎఫ్‌సిఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ కోల్పోతాయి. విదేశాల నుంచి విరాళాలు పొందాలనుకునే స్వచ్ఛంద సంస్థలు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం తప్పనిసరి. లైసన్సులు కోల్పోతే విదేశీ నిధులు రావు.

Updated Date - Nov 13 , 2024 | 06:06 AM