ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nitish Kumar: ‘ఇండియా’ కూటమి నుంచి నితీష్ వైదొలగడానికి కారణమిదేనట..!

ABN, Publish Date - Jan 28 , 2024 | 04:09 PM

Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) ఇండియా కూటమి(INDIA Alliance) నుంచి వైదొలుగుతున్నట్లు తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే, ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ నిష్ర్కమించడానికి బలమైన కారణం ఉందని జనతాదళ్(యునైటెడ్)(JDU) చెబుతోంది.

Nitish Kumar

పాట్నా, జనవరి 28: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) ఇండియా కూటమి(INDIA Alliance) నుంచి వైదొలుగుతున్నట్లు తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే, ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ నిష్ర్కమించడానికి బలమైన కారణం ఉందని జనతాదళ్(యునైటెడ్)(JDU) చెబుతోంది. దీనంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపిస్తున్నారు జేడీయూ నేతలు. ప్రతిపక్ష కూటమి నాయకత్వాన్ని హైజాక్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆరోపించారు ఆ పార్టీ నేతలు. ఈ కుట్రలో భాగంగానే.. మమతా బెనర్జీ సహాయంతో కూటమి తరఫున ప్రధాన మంత్రిగా మల్లిఖార్జున ఖర్గే పేరు ప్రతిపాదించారని జేడీయూ ముఖ్య నేత కేసీ త్యాగి ఆరోపించారు.

‘ఇండియా కూటమి నాయకత్వాన్ని కాంగ్రెస్ హైజాక్ చేయాలనుకుంది. డిసెంబర్ 19న జరిగిన సమావేశంలో.. ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి మల్లికార్జున ఖర్గే పేరును ప్రధానమంత్రిగా ప్రతిపాదించారు. గతంలో జరిగిన సమావేశంలో ప్రధాని అభ్యర్థి ఎవరనేది ముందుగా ప్రకటించకుండానే ఇండియా కూటమి పని చేస్తుందని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని తుంగలోకి తొక్కారు.’ అని జేడీయూ పార్టీ సీనియర్ నాయకు చెప్పుకొచ్చారు.

సీట్ల పంపకాలపై కాలయాపన..

‘సీట్ల పంపకాల విషయాన్ని కాంగ్రెస్ ఎటూ తేల్చకుండా నాన్చుతూ వచ్చింది. ఈ విషయాన్ని లాగుతూనే వస్తోంది. సీట్ల పంపకాన్ని త్వరగా పూర్తి చేయాలని అనేక సందర్భాల్లో చెప్పినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. ఇండియా కూటమి వద్ద బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ప్రణాళికలు లేవు.’ అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక, ఇండియా కూటమి ప్రధాన మంత్రిగా మల్లిఖార్జున ఖర్గే పేరును తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రతిపాదించారని, నితీష్ కుమార్ కన్వీనర్ పదవిని తిరస్కరించడంతో ఖర్గేను ప్రతిపక్ష కూటమి చైర్ పర్సన్‌గా ఎన్నుకున్నారని జేడీయూ నేతలు చెబుతున్నారు. మహాఘట్‌బంధన్‌ కూటమిలో నితీష్ కుమార్‌ను అగౌరవపరిచారని, నితీష్ తన ఉనికి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని జేడీయూ నేతలు వెల్లడించారు.

కాంగ్రెస్ ఫైర్..

నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు.. ఇండియా కూటమి నుంచి వెదొలిగిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ.. నితీష్ కుమార్ నిష్క్రమణతో ఇండియా కూటమికి వచ్చే ముప్పు ఏమీ లేదన్నారు. నితీష్‌ను ఊసరవెళ్లితో పోలుస్తూ తీవ్ర విమర్శలు చేశారు. నితీష్ కుమార్ ఊసరవెళ్లితో పోటీ పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి నిర్వహించిన అన్ని సమావేశాలకు ఆయన హాజరయ్యారని, ఆయనకు చాలా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకొచ్చారు జైరాం రమేష్.

‘ఎన్నికలు సమీపిస్తున్నాయి. భారతదేశ భవిష్యత్ ప్రమాదంలో ఉంది. కానీ, ఇండియా కూటమి భవిష్యత్‌కు వచ్చిన ఢోకా ఏమీ లేదు. బీజేపీ కొనసాగితే.. ఆ ప్రభుత్వం చాటున ఆర్ఎస్ఎస్ భావజాలం కొనసాగితే ఒక సమాజంగా, ఒక దేశంగా భారతదేశం భవిష్యత్ ప్రమాదంలో పడిపోతుంది’ అని పేర్కొన్నారు జైరాం రమేష్. నితీష్ పోతే వచ్చే నష్టం ఏమీ లేదని, ఇండియా కూటమి మరింత బలోపేతం అవుతుందన్నారాయన.

మమత లేకుండా కూటమి లేదు..!

ఇదే సమయంలో మమతా బెనర్జీపైనా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు జైరాం రమేష్. ఇండియా కూటమి మరింత బలపడుతుందని మమతా బెనర్జీ స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి లేకుండా ఇండియా కూటమిని ఊహించుకోలేం అన్నారు జైరాం రమేష్. కాగా, భారత్ జోడో న్యాయ్ యాత్రపై నితీష్ అంశం ఏమాత్రం ప్రభావం చూపబోదన్నారాయన. బీహార్ ప్రజలు నితీష్‌కు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. నితీష్ కుమార్, బీజేపీ మహా అయితే ఒకటి రెండు రోజులు వార్త కథనాల్లో టాప్‌లో ఉంటారు. ఆ తరువాత ప్రజలే వారికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు జైరాం రమేష్.

Updated Date - Jan 28 , 2024 | 04:11 PM

Advertising
Advertising