ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎయిర్‌ పోర్టు ఆధునీకరణకు అదానీతో ఒప్పందం వద్దు

ABN, Publish Date - Sep 12 , 2024 | 05:13 AM

కెన్యా రాజధాని నైరోబీలోని జోమో కెన్యెట్టా అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీకరణ కాంట్రాక్టును అదానీ గ్రూపునకు అప్పగించటానికి వ్యతిరేకంగా ఆ దేశ వైమానిక రంగ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. బుధవారం జోమో కెన్యెట్టా ఎయిర్‌పోర్టులో

కెన్యా వైమానికరంగ సిబ్బంది ఉద్యమం

నైరోబీ, సెప్టెంబరు 11: కెన్యా రాజధాని నైరోబీలోని జోమో కెన్యెట్టా అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీకరణ కాంట్రాక్టును అదానీ గ్రూపునకు అప్పగించటానికి వ్యతిరేకంగా ఆ దేశ వైమానిక రంగ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. బుధవారం జోమో కెన్యెట్టా ఎయిర్‌పోర్టులో వందలాదిమంది కార్మికులు, సిబ్బంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. కెన్యా వ్యాప్తంగా పలు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. జోమో కెన్యెట్టా విమానాశ్రయం ఆధునికీకరణతోపాటు అదనపు రన్‌వే, టెర్మినల్‌ నిర్మాణం పనులను అదానీ గ్రూపునకు అప్పగించాలని కెన్యా ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దీనికిగాను విమానాశ్రయం నిర్వహణను 30 ఏళ్ల పాటు అదానీ కంపెనీ చూసుకుంటుంది. అంటే అన్ని సంవత్సరాలపాటు ఆ ఎయిర్‌పోర్టు నుంచి వచ్చే ఆదాయం అంతా అదానీ గ్రూపు సొంతమవుతుంది. ఈ ఒప్పందాన్ని కెన్యా ఎయిర్‌పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కాంట్రాక్టు వల్ల అనేక మంది కార్మికులు, సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారని బుధవారం సమ్మెకు పిలుపునిచ్చింది. మరోవైపు, అదానీ ఒప్పందం అమలును స్థానిక హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేస్తూ సోమవారం తీర్పునిచ్చింది.

Updated Date - Sep 12 , 2024 | 05:13 AM

Advertising
Advertising