ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bhubaneswar: ప్రచారానికి నిధుల్లేవు.. పోటీ చేయలేను! కాంగ్రెస్‌ అభ్యర్థి సుచరిత

ABN, Publish Date - May 05 , 2024 | 03:51 AM

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే సూరత్‌, ఇండోర్‌లలో ఆ పార్టీ అభ్యర్థులను కోల్పోయిన విషయం తెలిసిందే.

టికెట్‌ వెనక్కిచ్చిన ఒడిశాలోని పూరీ కాంగ్రెస్‌ అభ్యర్థి సుచరిత

భువనేశ్వర్‌, మే 4: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే సూరత్‌, ఇండోర్‌లలో ఆ పార్టీ అభ్యర్థులను కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా ఒడిశా రాష్ట్రం పూరీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగిన సుచరితా మొహంతి ప్రచారానికి నిధుల్లేవంటూ పోటీ నుంచి తప్పుకున్నారు.


తన టికెట్‌ను వాపసు చేస్తున్నట్లు ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు శనివారం లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం కోసం పార్టీ నుంచి నిధులు అందడం లేదని ఆరోపించారు. సొంత నిధులతోనే ఎన్నికల్లో పోరాడాలని ఏఐసీసీ ఒడిశా ఇన్‌చార్జి అజోయ్‌ కుమార్‌ సూచించారని, తనకు అంత స్థోమత లేదని ఆమె పేర్కొన్నారు. పార్టీ నిధులు ఇవ్వకుండా పూరీలో ప్రచారం నిర్వహించడం సాధ్యం కాదని, అందుకే తన టికెట్‌ను వెనక్కి ఇస్తున్నట్లు తెలిపారు. పూరీ లోక్‌సభ స్థానానికి ఈ నెల 25న పోలింగ్‌ జరగనుంది. నామినేషన్ల సమర్పణకు తుది గడువు ఈ నెల 6. ఈ సమయంలో మొహంతి పోటీ నుంచి విరమించుకోవడంతో అక్కడ మరో అభ్యర్థి కోసం కాంగ్రెస్‌ పార్టీ అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొంది.

Updated Date - May 05 , 2024 | 03:51 AM

Advertising
Advertising