ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Budget 2024: ఆదాయం పన్ను రేట్లు, శ్లాబుల్లో మార్పుల్లేవు

ABN, Publish Date - Feb 01 , 2024 | 01:17 PM

ఆదాయ పన్ను వర్గాలకు నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్‌లో ఉపశమనం కలిగించే ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. గత ఏడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానమే ఈసారి కూడా కొనసాగుతుందని చెప్పారు.

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను వర్గాలకు నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) తాత్కాలిక బడ్జెట్‌లో ఉపశమనం కలిగించే ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. గత ఏడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానమే ఈసారి కూడా కొనసాగుతుందని, రూ.7 లక్షల వరకూ ఎలాంటి పన్ను భారం ఉండదని చెప్పారు. ప్రత్యక్ష, పరోక్ష, దిగుమతి సుంకాలకు పాత పన్ను విధానమే కొనసాగుతుందని తెలిపారు.


''గత పదేళ్లుగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగింది. రిటర్న్ ఫైలర్స్ 2.4 రెట్లు పెరిగాయి. పన్ను చెల్లింపుదారుల వాటాను దేశ సంక్షేమం, ప్రజల సంక్షేమానికి తెలివిగా ఖర్చుచేస్తామని వారికి హామీ ఇస్తున్నాను. పన్ను చెల్లింపుదారులు ఇస్తున్న సపోర్ట్‌కు అభినందిస్తున్నాను. ప్రభుత్వం పన్ను రేట్లను హేతుబద్ధం చేసింది. కొత్త పన్నుల పథకం కింద, రూ.7 లక్షల ఆదాయం వరకూ ఎలాంటి పన్ను ఉండదు. ఇందుకు ఎలాంటి పొదుపు, పెట్టుబడులతో పని ఉండదు. అంతకు మించి ఆదాయం కలిగిన వారికి శ్లాబుల ప్రకారం పన్ను వర్తిస్తుంది. గత ఏడాది ప్రతిపాదిత పాత పన్ను విధనంలో ఆదాయ పరిమితి రూ.2.50,000 గానే ఉంటుంది. పాత పన్ను విధానంలోనూ పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నప్పుడు ఎలాంటి భారం ఉండదు. ప్రస్తుతం ఉన్న దేశవాళి కంపెనీల కార్పొరేట్ టాక్స్ రేటు 30 శాతం నుంచి 22 శాతం తగ్గించాం. నిర్దిష్టమైన కొత్త మ్యాన్యుఫ్యాక్టరింగ్ కంపెనీలకు పన్ను రేటు 15 శాతం చేశాం'' అని నిర్మలా సీతారామన్ తెలిపారు.

Updated Date - Feb 01 , 2024 | 01:17 PM

Advertising
Advertising