Bihar: కు.ని ఆపరేషన్ చేసిన కాంపౌండర్: చనిపోయిన మహిళ
ABN, Publish Date - Apr 21 , 2024 | 04:34 PM
ఓ మహిళకు కాంపౌండర్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశాడు. దాంతో ఆమె మరణించింది. ఆసుపత్రి వద్ద మృతదేహంతో ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
పాట్నా, ఏప్రిల్ 21: ఓ మహిళకు కాంపౌండర్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశాడు. దాంతో ఆమె మరణించింది. ఆసుపత్రి వద్ద మృతదేహంతో ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
Taraka Ratna: ఎన్నికల వేళ.. అలేఖ్య రెడ్డి ట్విట్ వైరల్
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు ముసిరిఘరారి పట్టణంలోని అనిష హెల్త్ కేర్ సెంటర్‌కు బబితాదేవి (28)ని.. ఆమె బంధువులు తీసుకు వెళ్లారు. ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యుడు అందుబాటులో లేరు. దీంతో బబితకు కాంపౌండర్ శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ ఘటనపై ఆమె బంధువులు మాట్లాడుతూ... ఉదయం 9.00 గంటలకు బబితాదేవిని ఆసుపత్రికి తీసుకు వచ్చాం.
Bandi Sanjay : ఓట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు
హెడ్ నర్స్ ఆమెకు సెలైన్ బాటిల్ పెట్టింది. 11.00 గంటలా ప్రాంతంలో బబితకు ఆపరేషన్ ప్రారంభించారు. ఓ గంట తర్వాత.. ఏం జరిగిందో ఏమో.. ఆమెను మోహన్‌పూర్‌లోని ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. ఆ క్రమంలో బబిత శరీరంపై చెయ్యి వేస్తే.. చల్లగా ఉంది. అంటే అప్పటికే ఆమె చనిపోయింది. కానీ ఇవేమి తమకు తెలియనివ్వకుండా బబితను మోహన్‌పూర్‌కు తరలించారని మృతురాలు బంధువు తెలిపారు.
Wine Shops: మద్యంషాపులకు పోటెత్తిన మందుబాబులు..
అయితే మోహన్‌పూర్‌లో బబితాదేవి మరణించిందని వైద్యులు చెప్పారు. దీంతో అమె మృతదేహాన్ని వెనక్కి అంటే.. అనిష హెల్త్ కేర్ సెంటర్‌కు తీసుకు వచ్చి ఆందోళన చేపట్టారు. ముసిరిఘరారి పట్టణంలోని హెల్త్ కేర్ సెంటర్లో వైద్యులు కానీ, జూనియర్ సిబ్బంది కానీ లేరని మృతురాలి బంధువులు ఆరోపించారు.
INDIA bloc leaders: రాంచీలో ర్యాలీ
అందువల్లే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆసుపత్రి సిబ్బందిపై కేసు నమోదు చేయాలని పోలీసులను మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
జాతీయ వార్తలు కోసం..
Updated Date - Apr 21 , 2024 | 04:34 PM