ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mathura: మధుర సాహి ఈద్గాలో సర్వేపై స్టే విధించిన సుప్రీంకోర్టు

ABN, Publish Date - Jan 16 , 2024 | 12:20 PM

మధురలో గల కృష్ణ జన్మ భూమి సర్వే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం కీలకతీర్పు ఇచ్చింది. ఆలయం పక్కన ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వే చేపట్టడంపై స్టే విధించింది.

న్యూఢిల్లీ: మధురలో (Mathura) గల కృష్ణ జన్మ భూమి సర్వే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం కీలకతీర్పు ఇచ్చింది. ఆలయం పక్కన ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వే చేపట్టడంపై స్టే విధించింది.

శ్రీకృష్ణుడు జన్మించిన మధురలో షాహీ ఈద్గా నిర్మించారని, సర్వే చేయాలని మథుర జిల్లా కోర్టులో 9 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లు చాలాకాలంగా పెండింగ్ ఉన్నాయి. దాంతో మధుర జిల్లా కోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యాయి. గత ఏడాది డిసెంబర్‌లో హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. కోర్టు పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. సర్వే పర్యవేక్షణకు అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించడానికి పర్మిషన్ ఇచ్చింది.

హైకోర్టు ఉత్తర్వులపై ముస్లిం సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. సర్వే చేపట్టే ప్రక్రియ తక్షణమే నిలిపి వేయాలని స్పష్టంచేసింది. సర్వేకు సంబంధించి హిందూ సంఘాలకు నోటీసులు జారీ చేసింది. షాహీ ఈద్గాలో సర్వేకు సంబంధించి ఇక అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 16 , 2024 | 12:20 PM

Advertising
Advertising