ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జమ్మూకశ్మీర్‌లో ‘నామినేటెడ్‌’ మంటలు!

ABN, Publish Date - Oct 06 , 2024 | 05:34 AM

జమ్మూకశ్మీర్‌లో నామినేటెడ్‌ ఎమ్మెల్యేల వ్యవహారం అగ్గి రాజేస్తోంది. ఇక్కడ తొలిసారిగా ఐదుగురు నామినేటెడ్‌ సభ్యులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనున్నారు. ఈ నెల 8న అసెంబ్లీ ఎన్నికల

తొలిసారిగా అసెంబ్లీలో ఐదుగురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు

ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి: కాంగ్రెస్‌ ఆగ్రహం

న్యూఢిల్లీ, అక్టోబరు 5: జమ్మూకశ్మీర్‌లో నామినేటెడ్‌ ఎమ్మెల్యేల వ్యవహారం అగ్గి రాజేస్తోంది. ఇక్కడ తొలిసారిగా ఐదుగురు నామినేటెడ్‌ సభ్యులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనున్నారు. ఈ నెల 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందుగానే ఐదుగురిని సభకు నామినేట్‌ చేయాలన్న నిర్ణయంపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ చర్య ప్రజాస్వామ్య సూత్రాలు, రాజ్యాంగంపై దాడిగా ఆ పార్టీ నేతలు అభివర్ణించారు. ఐదుగురు ప్రతినిధుల నామినేషన్‌ను ఆమోదించవద్దని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాను కోరారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఐదుగురు సభ్యులను ఎల్‌జీ నామినేట్‌ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, జేకేపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు రవీందర్‌ శర్మ తెలిపారు. ఈ చర్యలన్నీ ప్రజాస్వామ్యం, ప్రజల తీర్పు, రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడి చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలను అనుకూలంగా మలుచుకోవడానికి అధికార బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఎదుర్కొంటామని ప్రకటించారు. కాంగ్రె్‌స-నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూటమి కచ్చితంగా మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019కి చేసిన సవరణల్లో భాగంగా కేంద్ర హోంశాఖ సూచనల మేరకు ఈ నామినేషన్లను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదించారు. 2023 జూలై 26న జరిగిన సవరణ ఈ ప్రక్రియకు వీలు కల్పిస్తోంది.

Updated Date - Oct 06 , 2024 | 05:34 AM