ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chennai: ఇండియా కూటమిలో లేను.. కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Feb 21 , 2024 | 03:10 PM

ఇండియా కూటమి(INDIA Bloc)లో చేరికపై నటుడు, మక్కల్ నీధి మయ్యమ్(MNM) అధ్యక్షుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎన్ఎం 7వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన చెన్నైలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఇండియా కూటమిలో తన పార్టీ లేదని వెల్లడించారు.

చెన్నై: ఇండియా కూటమి(INDIA Bloc)లో చేరికపై నటుడు, మక్కల్ నీధి మయ్యమ్(MNM) అధ్యక్షుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎన్ఎం 7వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన చెన్నైలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఇండియా కూటమిలో తన పార్టీ లేదని వెల్లడించారు. భూస్వామ్య రాజకీయాలకు దూరంగా ఉంటూ.. దేశం కోసం నిస్వార్థంగా ఆలోచించే పార్టీలకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

డీఎంకేతో పొత్తు పెట్టుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. రాజకీయాల్లోకి వస్తున్న ప్రముఖ తమిళ నటుడు విజయ్‌కి కమల్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీల పేరుతో పాలిటిక్స్ చేసే వారికి కాలం చెల్లింది.


దేశ భవిష్యత్తు కోసం నిస్వార్థంగా సేవ చేసేవారితో ఉంటామని అన్నారు. తాము ఇండియా కూటమిలో చేరలేదని.. పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయని.. వాటిల్లో ఏదైనా పురోగతి కనిపిస్తే చెబుతానని వెల్లడించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర తమిళనాడులో కొనసాగిన తరుణంలో ఆయన్ని కమల్ కలిసిన విషయం విదితమే. అప్పటినుంచే కమల్ పార్టీ ఇండియా కూటమిలో చేరబోతోందనే ఊహాగానాలు వినిపించాయి. కమల్ తన పార్టీని 2018లో స్థాపించగా.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి చవిచూశారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 21 , 2024 | 03:10 PM

Advertising
Advertising