ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Odisha Election 2024: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆస్తులు ప్రకటన

ABN, Publish Date - May 02 , 2024 | 10:22 AM

ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని హింజిలీ అసెంబ్లీ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. హింజిలీ నుంచి ఆరోసారి ఎన్నిక కావడమే లక్ష్యంగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు రూ.71 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఆయన ప్రకటించారు.

భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని హింజిలీ అసెంబ్లీ స్థానానికి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. హింజిలీ నుంచి ఆరోసారి ఎన్నిక కావడమే లక్ష్యంగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు రూ.71 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఆయన ప్రకటించారు. గత ఐదేళ్లలో తన ఆస్తులు రూ.7 కోట్ల మేర పెరిగాయని, దీంతో మొత్తం ఆస్తుల విలువ రూ.71.07 కోట్లకు పెరిగిందని చెప్పారు. కాగా 2019లో రూ.63.87 కోట్ల ఆస్తులను నవీన్ పట్నాయక్ చూపించారు.


64 పేజీలతో అఫిడవిట్‌లో పలు ఆస్తుల వివరాలను తెలిపారు. రూ.14.05 కోట్లకు పైగా చరాస్తులు, రూ.57.02 కోట్ల విలువైన స్థిరాస్తులను ఆయన ప్రస్తావించారు. ఆయన చరాస్తులలో వివిధ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో టర్మ్ డిపాజిట్లు ఉన్నాయి. భువనేశ్వర్‌ సిటీ రూ.13.66 కోట్ల విలువైన ‘నవీన్ నివాస్’, న్యూఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్‌లో రూ.43.35 కోట్ల ఇల్లు తన స్థిరాస్తులలో ఉన్నాయని వివరించారు.


ఢిల్లీలో ఉన్న ఈ నివాసంలో తనకు 50 శాతం వాటా ఉందని, భువనేశ్వర్‌లోని ‘నవీన్ నివాస్‌’లో మూడింట రెండొంతుల వాటా తనదేనని చెప్పారు. ఇక అఫిడవిట్ ప్రకారం... తన చేతిలో రూ.30,000 నగదు ఉందని వివరించారు. 1980 మోడల్ అంబాసిడర్ కారు ఉందని పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం రూ.8,905గా ఉన్న ఈ కారు విలువ రూ.6,434గా ఉందని చెప్పారు. తనపై ఎలాంటి బాధ్యతలు లేవని, క్రిమినల్ కేసు లేదని నవీన్ పట్నాయక్ వెల్లడించారు.

Updated Date - May 02 , 2024 | 10:23 AM

Advertising
Advertising