వాణిజ్య సిలిండర్ ధర రూ.39 పెంపు
ABN, Publish Date - Sep 02 , 2024 | 04:01 AM
చమురు సంస్థలు వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ ధరను మరోసారి పెంచాయి. అంతర్జాతీయ చమురు ధరల సరళికి అనుగుణంగా నెలవారీ చేసే సవరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: చమురు సంస్థలు వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ ధరను మరోసారి పెంచాయి. అంతర్జాతీయ చమురు ధరల సరళికి అనుగుణంగా నెలవారీ చేసే సవరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి రూ.39 పెంచాయి. ఆగస్టు 1న వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.6.50 పెంచిన చమురు సంస్థలు ఈ సారి మరింత భారం మోపాయి. తాజా నిర్ణయంతో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.1919కు పెరిగింది. ఇక, జూలై, ఆగస్టు నెలల్లో వరుసగా 1.2%, 2% మేర విమాన ఇంధన ధరలను పెంచిన చమురు సంస్థలు తాజా సవరణలో 4.6 శాతం తగ్గించాయి. సవరించిన ధర ప్రకారం.. ఏటీఎఫ్ కిలో లీటరుకు రూ.4,495.50 తగ్గి రూ.93,480.22 కు చేరింది.
Updated Date - Sep 02 , 2024 | 04:01 AM