ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Maldives request India: భారత్ పెద్దమనసు.. మాల్దీవుల విజ్ఞప్తిపై బియ్యం, గోధుమల ఎగుమతికి ఓకే

ABN, Publish Date - Apr 05 , 2024 | 09:37 PM

మాల్దీవులు చేసిన విజ్ఞప్తి మేరకు ఆ దేశానికి పరిమిత స్థాయిలో బియ్యం, గోధుమలు సహా పలు నిత్యావసర వస్తువుల ఎగుమతికి భారత ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ వస్తువుల ఎగుమతిపై ఏప్రిల్ 1 నుంచి 2024-25 సంవత్సరానికి నిషేధం ఉంది. అయితే ఇప్పుడు మాల్దీవులు చేసిన విజ్ఞప్తిపై ఆ దేశానికి నిత్యావసర వస్తువుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది.

న్యూఢిల్లీ: మాల్దీవులు(Maldives) చేసిన విజ్ఞప్తి మేరకు ఆ దేశానికి పరిమిత స్థాయిలో బియ్యం, గోధుమలు సహా పలు నిత్యావసర వస్తువుల ఎగుమతికి భారత ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ వస్తువుల ఎగుమతిపై ఏప్రిల్ 1 నుంచి 2024-25 సంవత్సరానికి నిషేధం ఉంది. అయితే ఇప్పుడు మాల్దీవులు చేసిన విజ్ఞప్తిపై ఆ దేశానికి నిత్యావసర వస్తువుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది.


మాల్దీవులు కొత్త అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు ఎన్నికైనప్పటికి నుంచి భారత్-మాల్దీవుల మధ్య సంబంధాల్లో క్షీణత కనిపించింది. ఆ దేశం చైనాకు దగ్గరవుతూ భారత్‌కు చేరవవుతున్న సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మాల్దీవుల విజ్ఞప్తికి భారత్ సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మాల్దీవులకు పరిమిత స్థాయిలో ఎగుమతులకు భారత్ తాజాగా అంగీకరించిన వస్తువుల్లో బియ్యం, గోధుమ పిండి, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కంకరరాయి, నది ఇసుక వంటివి ఉన్నాయి.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 05 , 2024 | 09:37 PM

Advertising
Advertising