ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

train tickets : ఇక 60 రోజులే ..

ABN, Publish Date - Oct 18 , 2024 | 05:59 AM

రైలు టికెట్‌ను ముందుగానే బుక్‌ చేసుకునే గడువును 60 రోజులకు తగ్గిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. నవంబరు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఈ బుకింగ్‌ సమయం 120 రోజుల వరకు ఉంది. రిజర్వేషన్‌ నాలుగు నెలల ముందు చేసుకునే కంటే రెండు నెలల ముందు చేసుకోవడం

రైలు టికెట్‌ బుకింగ్‌ గడువు కుదింపు

1 నుంచి కొత్త నిబంధన అమలులోకి

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రైలు టికెట్‌ను ముందుగానే బుక్‌ చేసుకునే గడువును 60 రోజులకు తగ్గిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. నవంబరు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఈ బుకింగ్‌ సమయం 120 రోజుల వరకు ఉంది. రిజర్వేషన్‌ నాలుగు నెలల ముందు చేసుకునే కంటే రెండు నెలల ముందు చేసుకోవడం ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. టికెట్‌ బుకింగ్‌కు 120 రోజుల వ్యవధి ఉండటం వల్ల ప్రయాణ ప్రణాళికలో మార్పులు జరిగి ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించామని రైల్వే అధికారులు తెలిపారు. వివిధ కారణాల వల్ల సగటున 21శాతం టికెట్లు రద్దవుతున్నాయని, మరో 4 నుంచి 5 శాతం ప్రయాణికులు రైలు ఎక్కేందుకు రావడం లేదని పేర్కొన్నారు. ఫలితంగా అక్రమ లావాదేవీలు, మోసపూరిత ఘటనలకు తావిచ్చినట్లు అవుతోందని తెలిపారు. 60 రోజుల రిజర్వేషన్‌ గడువు వల్ల ఈ తరహా సమస్యలను తగ్గించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. రిజర్వేషన్‌కు ఎక్కువ సమయం ఉండటం.. ప్రయాణించే ఉద్దేశం లేకున్నా వ్యక్తులు టికెట్‌ రిజర్వ్‌ చేసుకునేలా పురికొల్పుతోందని అన్నారు. తక్కువ వ్యవధి ఉండటం వల్ల టికెట్ల రద్దులు స్వల్పంగానే ఉంటాయని, దీంతో ప్రత్యేక రైళ్లను మరింత మెరుగ్గా ప్లాన్‌ చేసేందుకు వీలవుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.

Updated Date - Oct 18 , 2024 | 05:59 AM