ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ratan Sharada : అతివిశ్వాసమే బీజేపీని ముంచింది!

ABN, Publish Date - Jun 12 , 2024 | 04:33 AM

మూడోసారీ భారీ మెజారిటీతో గెలిచి తీరతామన్న అతి విశ్వాసమే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసిందా? ఎన్నికల్లో సహకరించాలని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌) నేతలను, కార్యకర్తలను ఆ పార్టీ నాయకత్వం ఆహ్వానించలేదా..? సంఘ్‌ పరివార్‌తో దాని సంబంధాలు సజావుగా

‘ఆర్గనైజర్‌’లో సంఘ్‌ నేత రతన్‌ శారద ధ్వజం

న్యూఢిల్లీ, జూన్‌ 11: మూడోసారీ భారీ మెజారిటీతో గెలిచి తీరతామన్న అతి విశ్వాసమే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసిందా? ఎన్నికల్లో సహకరించాలని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌) నేతలను, కార్యకర్తలను ఆ పార్టీ నాయకత్వం ఆహ్వానించలేదా..? సంఘ్‌ పరివార్‌తో దాని సంబంధాలు సజావుగా లేవా.. ఈ ప్రశ్నలకు.. సంఘ్‌ పత్రిక ‘ఆర్గనైజర్‌’లో వచ్చిన ఓ వ్యాసం కాదనే జవాబిస్తోంది. సంఘ్‌ జీవిత కాల కార్యకర్త రతన్‌ శారద రాసిన ఈ వ్యాసంలో చాలా కటువుగా తన అభిప్రాయాలను తెలియజేశారు. అతివిశ్వాసానికి అసలు వాస్తవం ఎన్నికల ఫలితాల ద్వారా చెక్‌ పెట్టిందన్నారు. నేతలు క్షేత్ర స్థాయికి వెళ్లకుండా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడానికే పరిమితమయ్యారని ఆక్షేపించారు. ఊహాలోకంలో విహరిస్తూ క్షేత్ర స్థాయి వాణిని వినిపించుకోలేదన్నారు. ‘తామే అసలైన రాజకీయ నేతలమని.. సంఘ్‌ సోదరులు పల్లెటూరి బైతులన్న అహంకారం బీజేపీ నేతల తలకెక్కింది’ అని విమర్శించారు. గత ఎన్నికల్లో 303 ఎంపీ స్థానాలు సొంతగా సాధించిన బీజేపీ.. ఈ దఫా 240 స్థానాలకే పరిమితమై.. సాధారణ మెజారిటీ (272)కి 32 స్థానాల దూరంలో నిలిచింది. దీంతో, ‘ఈసారి 400 సీట్లు దాటాలి’ అని ప్రధాని మోదీ పెట్టిన లక్ష్యం బీజేపీకేనన్న విషయం ఆ పార్టీ నేతలు గ్రహించలేదంటూ రతన్‌ మండిపడ్డారు. ‘మోదీ ప్రజాకర్షక శక్తి చూసి ఆనందించారు. క్షేత్రస్థాయి సమస్యలను గాలికొదిలారు. అంకితభావం కలిగిన వృద్ధ కార్యకర్తలను.. ప్రస్తుత సోషల్‌ మీడియా ‘సెల్ఫీ’ కార్యకర్తలు అలక్ష్యం చేశారు. బీజేపీ ఎంపీలు, మంత్రులు జనాలకు అందుబాటులో లేరు’ అని విమర్శించారు. బీజేపీ నేతలకు సంఘ్‌ అవసరం లేదా అని ప్రశ్నించారు. మోదీ మేజిక్‌కు కూడా పరిమితులున్నాయని స్పష్టం చేశారు. లోక్‌సభలోని మొత్తం 543 స్థానాల్లో ప్రధాని మోదీయే పోరాడుతున్నారన్న ఆలోచననే ఆయన గట్టిగా ఆక్షేపించారు. స్వీయ ఓటమికి కారణమైన ఈ ఆలోచనతోనే అభ్యర్థులను మార్చారని.. స్థానిక నేతలను పక్కపెట్టి బలవంతంగా అభ్యర్థులను రుద్దారని.. ఫిరాయింపుదారులకు ప్రాధాన్యమిచ్చారని.. బాగా పనిచేస్తున్న పార్లమెంటేరియన్లను కాదని చివరి నిమిషంలో పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చారని.. పరాజయానికి ఇవన్నీ కారణాలని రతన్‌ విశ్లేషించారు. ‘బీజేపీ అభ్యర్థుల్లో 25 శాతం మంది వలసవచ్చినవారేనని అంచనా. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి 30 శాతం మంది రెబెల్స్‌ కారణమన్న షాకింగ్‌ అనుభవం చూశాక కూడా లోక్‌సభ ఎన్నికల్లో అదే పనిచేశారు. స్థానిక సమస్యలు, అభ్యర్థుల ట్రాక్‌రికార్డు ఎన్నికల్లో విజయానికి గీటురాళ్లు. స్థానిక బీజేపీ కార్యకర్తల నిరాసక్తత కూడా ఓటమికి కారణం’ అని తెలిపారు.


అజిత్‌ పవార్‌ను చేర్చుకోవడం ఎందుకు?

మహారాష్ట్రలో అనవసర రాజకీయం కొంపముంచిందని రతన్‌ శారద అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పనితీరు దెబ్బతినడానికి ఇది కూడా కారణమన్నారు. ‘మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ, షిండే శివసేనకు చాలినంత మెజారిటీ ఉన్నప్పటికీ అజిత్‌ పవార్‌ సారథ్యంలోని ఎన్‌సీపీని చేర్చుకున్నారు. శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలె, అజిత్‌ పవార్‌ మధ్య అంతర్గత విభేదాలతో ఎన్‌సీపీ 2-3 ఏళ్లలో అంతరించి పోయేది. ఇలాంటి అక్కరమాలిన చర్య ఎలా చేపట్టారు? ఏళ్ల తరబడి కాంగ్రెస్‌ సిద్ధాంతాలపై బీజేపీ కార్యకర్తలు పోరాడారు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ ఒక్క దెబ్బతో బీజేపీ తన బ్రాండ్‌ విలువను తగ్గించుకుంది. మహారాష్ట్రలో నంబర్‌ వన్‌ పార్టీగా ఎదిగేందుకు ఏళ్లతరబడి పోరాడింది. ఇప్పుడు ఎలాంటి ప్రత్యేకతా లేని మామూలు రాజకీయ పార్టీగా మారిపోయింది’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘కాషాయ ఉగ్రవాదం’ అన్న పేరుతో హిందువులను వేధించి.. ముంబై 26/11 దాడులను ఆర్‌ఎ్‌సఎస్‌ కుట్రగా అభివర్ణించి.. ఆర్‌ఎ స్‌ఎ్‌సపై ఉగ్రవాద సంస్థగా ముద్రవేసి.. బీజేపీని హీనంగా చూసిన కాంగ్రెస్‌ నేతలను బీజేపీలో చేర్చుకోవడాన్ని రతన్‌ తీవ్రంగా విమర్శించారు. ఇది ఆర్‌ఎ్‌సఎస్‌ సానుభూతిపరులను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఆర్‌ఎ్‌సఎస్‌ పనిచేసిందా అన్న అంశంపైనా ఆయన ఘాటుగా స్పందించారు. ‘ఒక్క విషయం స్పష్టం చేయదలచుకున్నాను. ఆర్‌ఎ్‌సఎస్‌ శ్రేణులు బీజేపీకి క్షేత్రస్థాయి బలగం కాదు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. తనకంటూ సొంత కార్యకర్తలు ఉన్నారు’ అని ఎద్దేవాచేశారు. ‘‘ఎన్నికల పనిలో సహకారం కోరడానికి తమ సైద్ధాంతిక మిత్రులను బీజేపీ కార్యకర్తలు, స్థానిక నేతలు కోరాలా.. వద్దా? నాకు తెలిసినంతవరకు వారు మా సాయం కోరలేదు’’ అని కటువుగా తన వ్యాసంలో పేర్కొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 04:33 AM

Advertising
Advertising