ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pakistan Spy: వలలో పడ్డాడు.. రహస్యాలు లీక్ చేశాడు.. చివరికి ఏమైందంటే?

ABN, Publish Date - May 10 , 2024 | 06:59 PM

కొంతకాలం క్రితం ఒక వ్యక్తికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి పరిచయం అయ్యింది. ఆ అమ్మాయి తరచూ చాటింగ్ చేస్తూ.. తన తియ్యని మాటలతో ఆ వ్యక్తిని బుట్టలో పడేసింది. సర్వస్వం సమర్పించుకుంటానని చెప్పి, అతడ్ని పూర్తిగా లోబర్చుకుంది.

కొంతకాలం క్రితం ఒక వ్యక్తికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి పరిచయం అయ్యింది. ఆ అమ్మాయి తరచూ చాటింగ్ చేస్తూ.. తన తియ్యని మాటలతో ఆ వ్యక్తిని బుట్టలో పడేసింది. సర్వస్వం సమర్పించుకుంటానని చెప్పి, అతడ్ని పూర్తిగా లోబర్చుకుంది. ఇంకేముంది.. తాను ఆడిందే నాటకమంటూ అతని నుంచి భారత రక్షణ విభాగానికి చెందిన కీలక సమాచారాన్ని రాబట్టింది. చివరికి ఈ విషయం ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించి.. సదురు వ్యక్తిని పట్టుకుంది. అప్పుడు షాక్‌కి గురి చేసే సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ఆ అమ్మాయి పాకిస్తాన్‌కు (Pakistan) చెందిన ఐఎస్ఐ (ISI) ఆపరేటివ్ అని తెలిసి.. అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి.


అలా చేయకపోతే.. పాకిస్తాన్ అణుబాంబులేయడం తథ్యం

భారత్‌లోని రక్షణరంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగస్తులను టార్గెట్ చేసుకొని.. ఐఎస్ఐ వలపు వల విసురుతున్న విషయం తెలిసిందే. అమ్మాయిల పేర్లతో ఆ ఉద్యోగులతో పరిచయం ఏర్పరుచుకొని, మాయమాటలతో వారిని బుట్టలో పడేసి, భారత రహస్యాలను రాబట్టేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తోంది. తాజాగా ఇలాంటి ప్రయత్నమే మరొకటి చేసింది. ఇందులో భాగంగా.. సోనాల్ గార్గ్ (Sonal Garg) అనే అమ్మాయిని రంగంలోకి దిగింది. ఐఎస్ఐ ఆపరేటివ్ అయిన ఆ యువతి.. ప్రవీణ్ మిశ్రా (Praveen Mishra) అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుంది. ఆ వ్యక్తి భారత దళాలకు క్షిపణి, డ్రోన్‌ విడిభాగాలను సరఫరా చేసే ఓ సంస్థలో పని చేశాడు. తను చండీఘడ్‌లోని ఐబీఎం కార్యాలయంలో పని చేస్తున్నానని చెప్పిన సోనాల్.. ప్రవీణ్‌తో చాటింగ్ చేసి, అతడ్ని తన మాయలో పడేసింది. ఈ క్రమంలోనే.. తనకు సైన్యం, రక్షణ సంస్థలకు చెందిన సమాచారం కావాలని ఆమె అడిగింది.

కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు

ఇది దేశద్రోహమే అని తెలిసినా.. ఆమె కోసం ప్రవీణ్ కీలక సమాచారం సేకరించాడు. అంకాలేశ్వర్‌లోని ఓ కంపెనీకి చెందిన సున్నితమైన వివరాలు పొందాడు. ఆ కంపెనీ కంప్యూటర్స్‌లో మాల్‌వేర్‌ను చొప్పించే ప్రయత్నమూ చేశాడు. ప్రవీణ్ కదలికలపై అనుమానం కలగడంతో అతనిపై ఓ కన్నేసి ఉంచి ఉదంపూర్‌లోని మిలటరీ ఇంటెలిజెన్స్‌ విభాగం.. వెంటనే గుజరాత్ అధికారుల్ని అప్రమత్తం చేసింది. ఫైనల్‌గా అతడ్ని గుజరాత్‌ సీఐడీ అధికారులు భరూచ్‌ జిల్లాలో అరెస్టు చేశారు. అతని వద్ద ఉండే ఫోన్‌ని పరిశీలించగా.. అందులో భారీఎత్తున రక్షణ సమాచారం ఉందని, కొన్ని వివరాల్ని అతడు పాక్‌కు పంపాడని తేలింది. డ్రోన్ల తయారీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ వీటిల్లో ఉన్నట్లు వెల్లడైంది. అటు.. మిశ్రాని బుట్టలో పడేసేందుకు ఆ ఐఎస్ఐ ఆపరేటివ్ ఓ భారత నంబర్, నకిలీ ఫేస్‌బుక్ ఐడీని ఉపయోగించినట్టు తెలిసింది.

Read Latest National News and Telugu News

Updated Date - May 10 , 2024 | 06:59 PM

Advertising
Advertising