సౌదీలోకి పాక్ బిచ్చగాళ్లు!
ABN, Publish Date - Sep 26 , 2024 | 05:33 AM
ఆధ్యాత్మిక యాత్రల ముసుగులో పాకిస్థాన్ నుంచి పెద్ద సంఖ్యలో బిచ్చగాళ్లు తమ దేశంలోకి చొరబడి బిచ్చమెత్తుకుంటున్నారని సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితిని నియంత్రించకుంటే పాకిస్థాన్‌కు
ఆధ్యాత్మిక యాత్రల పేరిట ప్రవేశించి యాచన
ఇస్లామాబాద్, సెప్టెంబరు 25: ఆధ్యాత్మిక యాత్రల ముసుగులో పాకిస్థాన్ నుంచి పెద్ద సంఖ్యలో బిచ్చగాళ్లు తమ దేశంలోకి చొరబడి బిచ్చమెత్తుకుంటున్నారని సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితిని నియంత్రించకుంటే పాకిస్థాన్‌కు చెందిన ఉమ్రా, హజ్ యాతిక్రులపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యున్ పత్రిక మంగళవారం ఈ విషయాన్ని ప్రచురించింది. ఉమ్రా వీసాలతో పాకిస్థాన్ నుంచి బిచ్చగాళ్లు సౌదీలోకి ప్రవేశించకుండా నియంత్రించాలంటూ పాకిస్థాన్ మత వ్యవహారాల మంత్రిత్వశాఖకు సౌదీ హజ్ మంత్రిత్వశాఖ హెచ్చరిక జారీ చేసినట్టు పత్రిక పేర్కొంది.
ఆధ్యాత్మిక యాత్ర ముసుగులో బిచ్చగాళ్లు సౌదీలోకి ప్రవేశించకుండా నియంత్రించే మార్గాలను అన్వేషించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని సౌదీ హజ్ మంత్రిత్వశాఖ కోరింది. దీనిపై స్పందించిన పాకిస్థాన్.. ఉమ్రా యాత్రకు తీసుకెళ్లే ట్రావెల్ ఏజెన్సీలను నియంత్రించేందుకు ‘ఉమ్రా చట్టం’ను తీసుకొచ్చింది. మరోవైపు పాకిస్థాన్ హోంమంత్రి మోసిన్ నక్వీ.. సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సైద్ అహ్మద్ అల్ మల్‌కీతో సమావేశమై బిచ్చగాళ్లను సౌదీకి పంపించే మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది పాకిస్థాన్ ప్రతిష్టను మసకబారుస్తోందన్న మోసిన్.. దీనికి కారణమైన మాఫియాను ఉక్కుపాదంతో అణచివేయాలని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎ్‌ఫఐఏ)ని ఆదేశించారు.
పాక్ నుంచి బిచ్చగాళ్లు ఆధ్యాత్మిక యాత్రల ముసుగులో పశ్చిమాసియా దేశాల్లోకి ప్రవేశిస్తున్నారని, ఉమ్రా వీసాలపై సౌదీ అరేబియాకు వచ్చేవారిలో అత్యధికులు యాచనకు పాల్పడుతున్నారని పాకిస్థాన్ ప్రవాసుల మంత్రిత్వశాఖ కార్యదర్శి జీషాన్ ఖాన్‌జాదా గతేడాదే వెల్లడించారు. పాకిస్థాన్ ప్రవాసుల తీరు, నేరాలకు పాల్పడుతుండటంపై అనేక గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని ఆ శాఖ మరో కార్యదర్శి అర్షద్ మహమూద్ తెలిపారు. ఆ శాఖ వివరాల మేరకు గల్ఫ్ దేశాల్లో పట్టుబడుతున్న బిచ్చగాళ్లలో 90శాతం మంది పాకిస్థానీయులే ఉంటున్నారు.
ఇవి కూడా చదవండి
బైకుపై వినూత్న విన్యాసాలు చేయాలని చూస్తున్నారా.. వీళ్లూ అలాగే చేయగా
పడగెత్తిన కోబ్రా ముందే కోతి వింత చేష్టలు.. మరో పామును మెడలో వేసుకోవడంతో చివరకు.. చివరకు
Updated Date - Sep 26 , 2024 | 11:25 AM