ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Parliament : నీట్‌పై దద్దరిల్లిన పార్లమెంటు

ABN, Publish Date - Jun 29 , 2024 | 06:05 AM

నీట్‌ పరీక్షల్లో అవకతవకలపై పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం దద్దరిల్లాయి. నీట్‌పై సమగ్ర చర్చను చేపట్టాలన్న తమ డిమాండ్‌కు అధికారపక్షం అంగీకరించకపోవటంతో ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తొలుత చర్చిద్దామని, ఆ సందర్భంగా నీట్‌పైనా

నీట్‌పై చర్చకు విపక్షాల డిమాండ్‌.. నిరాకరించిన అధికారపక్షం

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై

తొలుత చర్చిద్దామని స్పష్టీకరణ.. వీడని ప్రతిష్టంభన

పలుమార్లు ఉభయసభలు వాయిదా

రాజ్యసభలో కళ్లు తిరిగి పడిన కాంగ్రెస్‌ ఎంపీ ఫూలోదేవినేతమ్‌

ఆస్పత్రికి తరలింపు, ఐసీయూలో చికిత్స.. ప్రతిపక్షాల వాకౌట్‌

న్యూఢిల్లీ, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): నీట్‌ పరీక్షల్లో అవకతవకలపై పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం దద్దరిల్లాయి. నీట్‌పై సమగ్ర చర్చను చేపట్టాలన్న తమ డిమాండ్‌కు అధికారపక్షం అంగీకరించకపోవటంతో ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తొలుత చర్చిద్దామని, ఆ సందర్భంగా నీట్‌పైనా చర్చ జరపవచ్చన్న ప్రభుత్వ సూచనకు విపక్షాలు అంగీకరించలేదు. దీంతో ఉభయసభల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఫలితంగా పలుమార్లు వాయిదా పడ్డాయి. ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే.. నీట్‌తోపాటు ఇతర పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైన ఘటనలపై చర్చను కోరుతూ కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇతర కార్యకలాపాలను రద్దు చేసి పేపర్‌ లీకేజీలపై చర్చను చేపడదామని విపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు. దీనిపై స్పీకర్‌ ఓం బిర్లా స్పందిస్తూ.. ఇటీవల దివంగతులైన 13 మంది మాజీ ఎంపీలకు తొలుత నివాళి అర్పిద్దామన్నారు. నివాళి ముగియగానే విపక్ష ఎంపీలు మళ్లీ తమ డిమాండ్‌ను కొనసాగించారు. నీట్‌ చాలా ముఖ్యమైన అంశమని, దానిపై చర్చ అవసరమని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. అయితే, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరపాలని ఇప్పటికే నిర్ణయించామని, ఆ చర్చలోనే అన్ని అంశాలనూ లేవనెత్తవచ్చని, తగిన సమయం ఇస్తానని స్పీకర్‌ చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ముందే మరో అంశంపై చర్చిద్దామని విపక్షం కోరటం గతంలో ఎన్నడూ జరగలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు అన్నారు. సభలో ప్రతిష్టంభన నేపథ్యంలో స్పీకర్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇటువంటి గందరగోళమే నెలకొంది. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చను పక్కనపెట్టి, ముందుగా నీట్‌పై చర్చిద్దామని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. విపక్ష నేత ఖర్గే వెల్‌లోకి రావటం తనను తీవ్రంగా బాధించిందని ధన్‌కడ్‌ పేర్కొన్నారు. కాగా, నిరసన సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీ ఫూలోదేవినేతమ్‌ కళ్లు తిరిగి పడిపోయారు. ఆమెను ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ఎంపీ బీపీ తీవ్రంగా పెరిగిందని, దాదాపుగా పక్షవాతం వచ్చే స్థాయిలో ఉందని వైద్యులు తెలిపినట్లుగా ఇతర ఎంపీలు వెల్లడించారు. చికిత్స తర్వాత ఫూలోదేవి కోలుకున్నారు.


మానవత్వానికే మచ్చ: రేణుకాచౌదరి

సభలో ఒక ఎంపీ కళ్లుతిరిగి పడిపోయినప్పటికీ, ఏమాత్రం పట్టించుకోకుండా సభా కార్యకలాపాలను చైర్మన్‌ కొనసాగించటాన్ని విపక్ష ఎంపీలు తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రె్‌సకే చెందిన రేణుకా చౌదరి మాట్లాడుతూ, ‘ఒక మహిళా ఎంపీ కళ్లు తిరిగి పడిపోతే, ఆమెను సహచర ఎంపీలు ఆస్పత్రికి తీసుకెళ్తుంటే కూడా సభ కొనసాగుతూనే ఉంది. అంటే, ఎంపీల ప్రాణాలకు విలువే లేదా? ఇది మానవత్వానికే మచ్చ’ అని దుయ్యబట్టారు. నీట్‌పై చర్చకు చైర్మన్‌ అంగీకరించకపోవటాన్ని నిరసిస్తూ విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. బీజేడీ ఎంపీలు కూడా వారితో కలిసి వాకౌట్‌ చేయటం విశేషం. కాగా, లోక్‌సభలో నీట్‌పై చర్చను చేపట్టాలంటూ రాహుల్‌గాంధీ మాట్లాడుతున్న సమయంలో ఆయన ముందున్న మైక్‌ను ఆపేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్‌లో ఒక వీడియోను షేర్‌ చేసింది. దీంట్లో రాహుల్‌... మైక్‌ను పునరుద్ధరించాలని స్పీకర్‌ను కోరటం కనిపించింది. కాగా, రాహుల్‌ విజ్ఞప్తికి స్పీకర్‌ స్పందిస్తూ.. తాను మైక్‌ను కట్‌ చేయలేదని, వాటిపై నియంత్రణ తన వద్ద ఉండదని చెప్పారు.

‘నీట్‌’ నుంచి మినహాయింపు ఇవ్వండి

చెన్నై, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేసేలా ఉన్న ‘నీట్‌’ పరీక్ష నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. అంతేగాక ఆ పరీక్షను రద్దు చేయాలని కూడా డిమాండ్‌ చేసింది. ఈ పరీక్ష నుంచి రాష్ట్రాన్ని మినహాయించాలని కోరుతూ గతంలో శాసనసభ ఆమోదించి, ప్రస్తుతం రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న నీట్‌ వ్యతిరేక బిల్లుకు వెంటనే ఆమోదం తెలపాలని కూడా డిమాండ్‌ చేసింది. తద్వారా మునుపటి లాగే విద్యార్థులకు ప్లస్‌-2 పబ్లిక్‌ పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా వైద్య కోర్సుల్లో ప్రవేశం కల్పించే పాతపద్ధతిని అమలు చేసేందుకు మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ప్రతిపాదించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Updated Date - Jun 29 , 2024 | 06:05 AM

Advertising
Advertising